News March 30, 2024
BIG BREAKING: వాలంటీర్లపై సీఈసీ ఆంక్షలు
AP: కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.
Similar News
News November 7, 2024
టెస్టు జట్టులో పుజారాకు చోటు అత్యవసరం: ఉతప్ప
టెస్టు జట్టులో ఛతేశ్వర్ పుజారాకు ఇంకా చోటు ఉందని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేయకపోవడం భారత మేనేజ్మెంట్ చేసిన తప్పిదమని అభిప్రాయపడ్డారు. ‘ఈ జట్టులో పుజారాకు చోటు ఇవ్వడం ప్రస్తుతం ఓ అవసరం. ఓపెనింగ్ నుంచి 6వ ప్లేస్ వరకు అందరూ దూకుడుగా ఆడే ఆటగాళ్లే. పుజారా, ద్రవిడ్, విలియమ్సన్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో చోటు ఎప్పుడూ ఉంటుంది’ అని వివరించారు.
News November 7, 2024
‘బాహుబలి’ గేటు మూసివేతపై మీరేమంటారు?
TG: సచివాలయ ‘<<14547237>>బాహుబలి<<>>’ గేటును శాశ్వతంగా మూసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తు బాగాలేదనే కారణంతో ఈ చర్యలు చేపట్టినట్లు మరోవైపు ప్రచారం జరుగుతోంది. కాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపలే పెట్టాలని ప్రజలు అడిగారా? రూ.3.2కోట్ల ప్రజాధనం వృథా చేయడమెందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 7, 2024
కిడ్నీ పనితీరుకు ఈ లక్షణాలే సూచనలు
శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించడంలో మూత్రపిండాలది కీలక పాత్ర. మరి మన కిడ్నీలు అనారోగ్యంగా ఉన్నాయనడానికి సూచనలేంటి? వైద్య నిపుణుల ప్రకారం.. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. ఒళ్లు, కాళ్లు నీరు పట్టినట్లు కనిపిస్తున్నా, మూత్రంలో రక్తం వస్తున్నా అనుమానించాల్సిందే. ప్రధానంగా మధుమేహం, బీపీ ఉన్నవారు, ధూమపాన ప్రియులు కచ్చితంగా కిడ్నీ పరీక్షల్ని తరచూ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.