News March 30, 2024

BIG BREAKING: వాలంటీర్లపై సీఈసీ ఆంక్షలు

image

AP: కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.

Similar News

News April 20, 2026

డిగ్రీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫ్రీ హాస్టల్, కోచింగ్

image

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ BC గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 అకడమిక్ ఇయర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 కాలేజీల్లో BSc, BCom, BBA లాంటి రెగ్యులర్ కోర్సులతో పాటు యానిమేషన్ వంటి స్పెషల్ కోర్సుల్లో 9,260 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు మే 10వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఉచిత వసతితోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్, పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు.

News April 20, 2026

జనగణన ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ?

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల నిషేధాన్ని ఎత్తివేయాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫైలుపై CM రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. జనగణన విధులు ముగిశాకే రిలీవింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. రెండేళ్ల సర్వీస్ పూర్తికాని వారికి ఈసారి ఛాన్స్ లేదు. అలాగే స్పౌజ్ కేటగిరీ, దివ్యాంగులకు టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నారు.

News April 20, 2026

జూన్/జులైలో MPTC, ZPTC ఎన్నికలు?

image

TG: MPTC, ZPTC ఎన్నికలను జూన్ చివరి వారం లేదా జులైలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. గతంలో మే నెలలోనే జరపాలని అనుకున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం జనాభా గణన చేపట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 11 నుంచి జూన్ 9 వరకు జనాభా గణన ప్రక్రియ కొనసాగనుంది. ఈలోగా ఓటర్ల జాబితా సవరణ కూడా పూర్తి చేయాల్సి ఉండటంతో యంత్రాంగం బిజీగా ఉంది.