News March 30, 2024

లాంగ్ లైఫ్ కావాలా? చదువుకోండి ఫస్టు: పరిశోధకులు

image

వ్యాయామం శరీరానికి మేలు చేసినట్టే చదువు కూడా చేస్తుందట! మూడు తరాలకు చెందిన 3,101 మందిపై US, నార్వే, UKకు చెందిన నిపుణులు పరిశోధించి ఈ విషయం కనుగొన్నారు. విద్యపై ఎంత ఎక్కువ కాలం గడిపితే వృద్ధాప్యం అంత నెమ్మదిగా వస్తుందట. శరీరంలోని కణాలు డ్యామేజ్ కావడాన్ని తగ్గిస్తుందని, ఫలితంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. ఇది కచ్చితంగా ఎలా జరుగుతోందనే విషయంపై పరిశోధన చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.

Similar News

News September 16, 2025

డిసెంబ‌రు క‌ల్లా గుంత‌ల ర‌హిత రోడ్లు: కృష్ణబాబు

image

AP: రాష్ట్రంలో 19వేల కి.మీ. రోడ్ల‌ను రూ.860 కోట్లతో గుంత‌ల ర‌హితంగా మార్చినట్లు రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ‘ఈ డిసెంబ‌రుక‌ల్లా ర‌హ‌దారుల‌ను గుంత‌ల ర‌హితంగా మార్చాల‌న్న‌దే ల‌క్ష్యం. మ‌రో 5946 కి.మీ. రోడ్ల‌ మరమ్మతులకు రూ.500 కోట్లు మంజూరు చేశాం. 8744 కి.మీ. జాతీయ‌ ర‌హ‌దారుల‌నూ బాగుచేశాం. PPP మోడ్‌లో 12,653 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయ‌నున్నాం’ అని తెలిపారు.

News September 16, 2025

సెప్టెంబర్ 16: చరిత్రలో ఈరోజు

image

✒ 1916: ప్రముఖ గాయని MS సుబ్బలక్ష్మి(ఫొటోలో) జననం
✒ 1923: సింగపూర్ జాతి పిత లీ క్వాన్‌ యూ జననం
✒ 1945: కాంగ్రెస్ నేత పి.చిదంబరం జననం
✒ 1959: ప్రముఖ నటి రోజా రమణి జననం
✒ 1975: నటి మీనా జననం
✒ 2012: హాస్య నటుడు సుత్తివేలు మరణం
✒ 2016: పౌరహక్కుల నేత బొజ్జా తారకం మరణం
✒ 2019: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం
✒ అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం

News September 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.