News March 30, 2024

లాంగ్ లైఫ్ కావాలా? చదువుకోండి ఫస్టు: పరిశోధకులు

image

వ్యాయామం శరీరానికి మేలు చేసినట్టే చదువు కూడా చేస్తుందట! మూడు తరాలకు చెందిన 3,101 మందిపై US, నార్వే, UKకు చెందిన నిపుణులు పరిశోధించి ఈ విషయం కనుగొన్నారు. విద్యపై ఎంత ఎక్కువ కాలం గడిపితే వృద్ధాప్యం అంత నెమ్మదిగా వస్తుందట. శరీరంలోని కణాలు డ్యామేజ్ కావడాన్ని తగ్గిస్తుందని, ఫలితంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. ఇది కచ్చితంగా ఎలా జరుగుతోందనే విషయంపై పరిశోధన చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.

Similar News

News January 14, 2025

గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధిస్తాం: CM

image

TG: ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటించబోతున్నట్లు CM రేవంత్ వెల్లడించారు. సింగపూర్‌లో స్కిల్ వర్సిటీతో ఒప్పందాలు, ఇతర పెట్టుబడులపై సంప్రదింపులు జరుపుతామన్నారు. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటామని చెప్పారు. గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధించడమే తమ లక్ష్యమన్నారు. గత ఏడాది దావోస్‌లో ₹40,232 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు.

News January 14, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ పబ్లిక్ టాక్

image

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమాలో కామెడీ అదిరిపోయిందని, వెంకీ నటన ఇరగదీశారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. స్టోరీ అంతగా లేదని, లాజిక్స్ వెతకకుండా చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుందని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.

News January 14, 2025

నాలుగు పథకాలకు రూ.45వేల కోట్లు: భట్టి

image

TG: రాష్ట్రంలో కొత్తగా తీసుకురానున్న 4 సంక్షేమ పథకాల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వీటిలో ఇందిరమ్మ ఇళ్లకు రూ.22,500 కోట్లు, రైతు భరోసాకు రూ.18వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.