News March 30, 2024
మయాంక్ దెబ్బ.. పంజాబ్ ఓటమి
లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ కుదేలైంది. 200 రన్స్ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు శిఖర్(70), బెయిర్‌స్ట్రో(42) రాణించారు. అయితే మయాంక్ నిప్పులు చెరిగే బంతులతో 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను పంజాబ్ నుంచి లాగేశారు. ఆఖర్లో పంజాబ్ బ్యాటర్లు విఫలమవడంతో 20 ఓవర్లలో 178/5 రన్స్ మాత్రమే చేసింది. 21 రన్స్ తేడాతో ఓడింది.
Similar News
News November 7, 2024
US ఎన్నికలు: అమెరికాలో ఎక్కువ సెర్చ్ చేసింది ఏంటంటే?
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో గెలుపెవరిదో తెలుసుకునేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. గత నెల 31 నుంచి ఈనెల 6వరకు ఇండియాలో ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేశారో గూగుల్ ట్రెండ్స్ రివీల్ చేసింది. ఇండియాలో అధికంగా డొనాల్డ్ ట్రంప్ గురించి సెర్చ్ చేసినట్లు తెలిపింది. కేవలం తమిళనాడులోనే కమలా హారిస్ గురించి సెర్చ్ చేశారు. అత్యధికంగా సెర్చ్ చేసింది మాత్రం డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగిన విషయం గురించే.
News November 7, 2024
ఫార్ములా ఈ-కార్ రేసింగ్.. అసలేం జరిగింది?
TG: 2023లో నిర్వహించిన ఫార్ములా- ఈ కార్ రేస్‌కు ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు. దీంతో <<14548797>>KTR <<>>రిక్వెస్ట్‌తో 2024 FEBలో జరగాల్సిన 2వ దఫా రేస్ నిర్వహణకు HMDA ₹55 కోట్లు FEOకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఎన్నికల వేళ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు ₹55cr ఇవ్వడంపై కాంగ్రెస్ GOVT తప్పుబట్టింది. KTR మౌఖిక ఆదేశాలతోనే చెల్లించినట్లు పురపాలక శాఖ కమిషనర్ విచారణలో తెలిపారు.
News November 7, 2024
131 ఏళ్లలో ఒకే ఒక్కడు ట్రంప్
అమెరికా అధ్యక్ష పీఠంపై వరుసగా రెండుసార్లు కూర్చున్న నేతలు 15 మంది ఉన్నారు. వారిలో లింకన్, నిక్సన్, క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా ముఖ్యులు. అయితే తొలి దఫా(2016-20) తర్వాత వెంటనే కాకుండా నాలుగేళ్ల వ్యవధి అనంతరం పదవి చేపట్టిన రెండో నేతగా ట్రంప్ నిలిచారు. గత 131 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. చివరిసారిగా గ్రోవర్ క్లీవ్‌లాండ్(1885-89, 1893-97) ఇలా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.