News March 31, 2024
విమానం ఒక రోజు ఆలస్యం.. ఎయిర్ ఇండియాకు రూ.85,000 ఫైన్
విమాన ఆలస్యంపై ఓ ప్రయాణికుడు చేసిన ఫిర్యాదుపై ముంబై వినియోగదారుల కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అతనికి రూ.85,000 పరిహారం చెల్లించాలని ఎయిర్ ఇండియాకు స్పష్టం చేసింది. 2018లో బ్యాంకాక్ నుంచి ముంబై బయలుదేరాల్సిన విమానం ఒక రోజు ఆలస్యమైంది. సంస్థ నిర్లక్ష్యానికి తాను మానసిక వేదనకు గురయ్యానని, ఒక వర్క్ డేను కోల్పోయానని మోహిత్ నిగమ్(33) ఫిర్యాదు చేశారు. సుదీర్ఘంగా విచారించిన కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.
Similar News
News November 7, 2024
‘మహాలక్ష్మీ’ పథకం ఉద్దేశం నెరవేరుతోంది: సీఎం రేవంత్
TG: ఆడబిడ్డల ఆకాంక్షలను నెరవేర్చాలనే సంకల్పంతో ‘మహాలక్ష్మీ’ పథకాన్ని ప్రకటించామని CM రేవంత్ అన్నారు. ‘మహాలక్ష్మీ పథకాన్ని ఉపయోగించుకుని విద్యార్థినులు మైదానాలకు వెళ్లి స్పోర్ట్స్ నేర్చుకుంటున్నారు’ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు CM రిప్లై ఇచ్చారు. ‘ఈ మహాలక్ష్ములను చూస్తుంటే మా ఉద్దేశం నెరవేరుతోందని అర్థమవుతోంది. చాలా సంతోషం. వీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు.
News November 7, 2024
సందీప్ కిషన్‌తో పూరీ జగన్నాథ్ సినిమా?
లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ల తర్వాత పూరీ జగన్నాథ్ కొత్త ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఇందులో హీరో సందీప్ కిషన్ నటిస్తారని తెలుస్తోంది. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఇతనికి కూడా సరైన విజయం దక్కలేదు. దీంతో సందీప్ మేనమామ శ్యామ్ కె.నాయుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. స్నేహితుడు పూరీతో కలిసి మూవీని పట్టాలెక్కిస్తున్నారని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
News November 7, 2024
2027లో ఫలితం అనుభవిస్తారు: విజయసాయిరెడ్డి
AP: YCP కార్యకర్తలను అరెస్ట్ చేసే కొందరు కుల పిచ్చి అధికారులు, TDP నేతలు 2027లో ఫలితం అనుభవించాల్సి ఉంటుందని MP విజయసాయిరెడ్డి అన్నారు. ఇందుకు తయారుగా ఉండాలని ఆయన చెప్పారు. ‘పైశాచిక పోస్టులు పెడుతున్న TDP సైకోలకు చెక్ పెట్టరా? ఖాకీలు, YCP సోషల్ మీడియా కార్యకర్తలను నెల రోజుల్లో సెట్ చేస్తాననడం అధికార అహంకారమే. కడప SPపై వేటుతో TDP తన కుల విధానంపై క్లారిటీ ఇచ్చేసిందా?’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.