News March 31, 2024
యుద్ధప్రాతిపదికన పెన్షన్లు పంపిణీ చేయాలి: అచ్చెన్నాయుడు
AP: సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఒకటో తేదీనే యుద్ధప్రాతిపదికన పెన్షన్లు పంపిణీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వాలంటీర్లను వైసీపీ ప్రచారానికి వాడుకోవడం వల్లే వారిని పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించిందన్నారు. వారు సస్పెన్షన్‌కు గురి కావడానికి సీఎం జగన్ కారణమయ్యారని విమర్శించారు.
Similar News
News November 7, 2024
2027లో ఫలితం అనుభవిస్తారు: విజయసాయిరెడ్డి
AP: YCP కార్యకర్తలను అరెస్ట్ చేసే కొందరు కుల పిచ్చి అధికారులు, TDP నేతలు 2027లో ఫలితం అనుభవించాల్సి ఉంటుందని MP విజయసాయిరెడ్డి అన్నారు. ఇందుకు తయారుగా ఉండాలని ఆయన చెప్పారు. ‘పైశాచిక పోస్టులు పెడుతున్న TDP సైకోలకు చెక్ పెట్టరా? ఖాకీలు, YCP సోషల్ మీడియా కార్యకర్తలను నెల రోజుల్లో సెట్ చేస్తాననడం అధికార అహంకారమే. కడప SPపై వేటుతో TDP తన కుల విధానంపై క్లారిటీ ఇచ్చేసిందా?’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
News November 7, 2024
శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీలో భాగంగా ఒడిశాతో మ్యాచులో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ చేశారు. 201 బంతుల్లో 22 ఫోర్లు, 8 సిక్సులతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తన మూడో డబుల్ హండ్రెడ్‌ను నమోదు చేశారు. రంజీల్లో ఆయనకి ఇది రెండో డబుల్ సెంచరీ కాగా, మొదటిది 2015లో చేశారు. ఇటీవల మహారాష్ట్రతో మ్యాచులోనూ ఆయన సెంచరీతో రాణించారు. దీంతో అయ్యర్ త్వరలోనే జాతీయ జట్టులోకి తిరిగి రావొచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
News November 7, 2024
డిగ్రీ అర్హత.. IDBIలో 1,000 ఉద్యోగాలు
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లో 1,000 పోస్టుల(కాంట్రాక్ట్) భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ ఉత్తీర్ణులై, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 01-10-2024 నాటికి 20-25 ఏళ్లు ఉండాలి. డిసెంబర్ 1న ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి రూ.29,000-31,000 వేతనం ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
వెబ్‌సైట్: https://www.idbibank.in/