News March 31, 2024

సత్తెనపల్లి గడ్డపై సత్తా చాటేదెవరో?

image

AP: రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉన్న నియోజకవర్గం పల్నాడు(D) సత్తెనపల్లి. ఇక్కడ అభ్యర్థికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఇక్కడి నుంచే 2సార్లు ఇండిపెండెంట్‌గా గెలిచారు. కాంగ్రెస్ 4సార్లు, స్వతంత్రులు 3సార్లు, CPM, TDP 2సార్లు, CPI, YCP ఒక్కోసారి నెగ్గాయి. ఈసారి రాజకీయాల్లో తలపండిన అంబటి రాంబాబు (YCP), కన్నా లక్ష్మీనారాయణ(TDP) ఢీకొంటున్నారు.
#ELECTIONS2024

Similar News

News October 6, 2024

డీఎస్సీ సర్టిఫికెట్ పరిశీలన పూర్తి

image

TG: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఒక్కో ఉద్యోగానికి 1:3 చొప్పున 25,924 మందిని వెరిఫికేషన్‌కు పిలవగా 24,466 మంది హాజరయ్యారు. మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్ కోటాలో టీచర్ పోస్టులకు కొన్ని జిల్లాలో వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. కాగా డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈ నెల 9న LB స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ అందజేయనున్నారు.

News October 6, 2024

ఐదో రోజు అట్ల బతుకమ్మ

image

TG: బతుకమ్మ పండగ నిర్వహించే తొమ్మిది రోజుల్లో రోజుకో విశిష్ఠత ఉంది. ఇవాళ ఐదో రోజును అట్ల బతుకమ్మగా పిలుస్తారు. నానబెట్టిన బియ్యాన్ని మర పట్టించి ఆ పిండితో అట్లు పోసి గౌరమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. ఆడవాళ్లు వీటిని ఒకరికొకరు వాయినంగా ఇచ్చుకుంటారు. ఇవాళ బతుకమ్మను ఐదు వరుసల్లో వివిధ పూలతో చేస్తారు.

News October 6, 2024

నేడు లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ

image

నేడు విజయవాడ కనక దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమివ్వనుంది. త్రిపురత్రయంలో రెండో శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. తల్లిని కొలిస్తే కష్టాలు తొలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మాత అనుగ్రహం పొందేందుకు ‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమ:’ అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెబుతున్నారు.