News August 7, 2025

ప్రజల డబ్బుకు మీ డబ్బా ఎందుకబ్బా!

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల <<17319958>>స్కీములకు<<>> పార్టీ నాయకుల పేర్లు, ఫొటోల వాడకం దేశంలో సాధారణమైంది. సొంత డబ్బు ప్రజలకు ఖర్చు చేస్తే ఆ నేత పేరు, ఫొటో పెట్టుకుంటే సరే కానీ ప్రజల డబ్బుతో అందించే పథకాలకు సొంత ప్రచారం సరికాదని ఎప్పట్నుంచో విమర్శలున్నాయి. CM/PM ఫొటో బదులు శాశ్వతంగా ఉండే ప్రభుత్వ చిహ్నం వాడటం ఉత్తమం. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీ ప్రభుత్వమూ ఇలా చేయదు. ఇంతకీ నేతల ఫొటో, పేరు ఉండాలా?ఏమంటారు?

Similar News

News August 11, 2025

బంగారం ధరలు మరింత పెరుగుతాయ్?

image

ఈవారం కూడా బంగారం ధరలు పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థూల ఆర్థిక అనిశ్చితి, టారిఫ్స్‌తో జరుగుతున్న వాణిజ్య యుద్ధం, సెంట్రల్ బ్యాంక్స్ బంగారం కొనుగోళ్లు కొనసాగించడమే కారణమని అభిప్రాయ పడుతున్నారు. అందుకే ఇన్వెస్టర్స్ గోల్డ్‌పై పెట్టుబడి పెడుతున్నారని, తద్వారా ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అంటుతాయని అంచనా వేస్తున్నారు.

News August 11, 2025

నేడు ED విచారణకు రానా

image

బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్‌ కేసులో నేడు హీరో రానా ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఆగస్టు 11న విచారణకు హాజరుకావాలని రానాకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జులై 23న రావాలని కోరగా మరో తేదీ కావాలన్నారు. దాంతో కచ్చితంగా ఆగస్టు 11న హాజరవ్వాలన్నారు నగదు లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ED విచారణకు ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ దేవరకొండ హాజరయ్యారు.

News August 11, 2025

కొడుకు కోసం.. 90 ఏళ్ల వయసులో తల్లి పోరాటం

image

జైలుకెళ్లిన కొడుకు కోసం 90 ఏళ్ల ఓ తల్లి పోరాడుతోంది. చైనాలోని జెఝియాంగ్‌కు చెందిన లిన్(57) జైలులో ఉన్నారు. కుమారుడికి దూరంగా ఉండలేక.. ఆ తల్లి కేసు వాదించే ప్రయత్నిస్తోంది. ‘లా’ పుస్తకాలు తిరగేస్తోంది. ఏం జరిగందంటే.. హువాంగ్ అనే వ్యాపారవేత్తతో కలిసి లిన్‌ గ్యాస్ ప్రొడక్షన్ చేశాడు. హువాంగ్ పేమెంట్స్ చేయలేదని, అతని అవినీతి బయటపెడతానని లిన్ బెదిరించాడు. వ్యాపారి ఫిర్యాదుతో లిన్‌ 2023లో అరెస్టయ్యాడు.