News August 11, 2025
బంగారం ధరలు మరింత పెరుగుతాయ్?

ఈవారం కూడా బంగారం ధరలు పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థూల ఆర్థిక అనిశ్చితి, టారిఫ్స్‌తో జరుగుతున్న వాణిజ్య యుద్ధం, సెంట్రల్ బ్యాంక్స్ బంగారం కొనుగోళ్లు కొనసాగించడమే కారణమని అభిప్రాయ పడుతున్నారు. అందుకే ఇన్వెస్టర్స్ గోల్డ్‌పై పెట్టుబడి పెడుతున్నారని, తద్వారా ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అంటుతాయని అంచనా వేస్తున్నారు.
Similar News
News April 18, 2026
మహిళా రిజర్వేషన్: 2034 వరకు ఆగాల్సిందేనా?

2026 జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యాకే ‘నారీ శక్తి వందన్ అధినియం-2023’ చట్టం అమల్లోకి వస్తుందని అప్పట్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. తాజాగా 131వ సవరణ బిల్లు వీగిపోవడంతో 2029లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం కష్టమని, 2034 వరకు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పటివరకు మహిళలు వేచి చూడాల్సిందేనేమో!
News April 18, 2026
మహిళలకు విపక్షాల ద్రోహం: CM

AP: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దారుణమని సీఎం చంద్రబాబు విమర్శించారు. విపక్షాలన్నీ కలిసి మహిళల సాధికారతను అడ్డుకున్నాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల వైఖరిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ఇది రాజకీయ అడ్డంకి మాత్రమే కాదని, కోట్లాది మంది మహిళలకు చేసిన ద్రోహం కూడా అని మండిపడ్డారు.
News April 18, 2026
ఇరాన్, లెబనాన్‌లో మేం సాధించింది ఇదే: ఇజ్రాయెల్

ఇరాన్, లెబనాన్‌పై దాడుల్లో తాము సాధించిన విజయాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్ చేసింది. ఇరాన్‌లో 28 మంది సీనియర్ లీడర్లను అంతం చేశామని, 10,800 దాడులు చేశామని తెలిపింది. 250 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను నాశనం చేశామని వెల్లడించింది. అటు లెబనాన్‌లో 1700 మందికి పైగా టెర్రరిస్టులను చంపేశామని, 5 వేలకు పైగా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని వివరించింది.


