News August 7, 2025

బీసీ రిజర్వేషన్లు.. నెక్స్ట్ ఏంటి?

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించకపోవడంతో రాహుల్‌ను PMను చేసి రిజర్వేషన్లు సాధిస్తామని <<17320951>>CM రేవంత్<<>> నిన్న అన్నారు. దీంతో ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News August 11, 2025

జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ ఫోన్

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాలను మోదీకి జెలెన్‌స్కీ వివరించారు. ‘శాంతిస్థాపనకు భారత్ కట్టుబడి ఉంది. శాంతియుత పరిష్కారానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఉక్రెయిన్‌కు భారత్ సహకారం కొనసాగుతుంది. భవిష్యత్‌లోనూ సంప్రదింపులు కొనసాగిస్తాం’ అని మోదీ భరోసా ఇచ్చారు. కాగా వచ్చే సెప్టెంబర్‌లో ఇరువురు నేతలూ భేటీ కానున్నారు.

News August 11, 2025

అరుదైన వ్యాధి: ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే!

image

రాజస్థాన్‌లో మోడ్రన్ కుంభకర్ణుడిగా పేరుగాంచిన పుర్ఖారామ్ అనే 46 ఏళ్ల వ్యక్తి నెలలో 25 రోజులు నిద్రపోయే ఉంటారు. ఆయనకు 23 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. యాక్సిస్ హైపర్సోమ్నియా అనే ఈ నరాల సంబంధిత వ్యాధి వల్ల ఆయన ఏకధాటిగా నిద్రపోతుంటారు. మిగిలిన ఐదు రోజులు మాత్రమే తన వ్యాపారం చేసుకుంటున్నారు. నిద్రలోనే కుటుంబీకులు అతనికి తినిపించడం, స్నానం చేయించడం చేస్తుంటారు.

News August 11, 2025

రాష్ట్రంలో లాజిస్టిక్ కార్పొరేషన్: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రాన్ని సరకు రవాణా మార్గాలకు కేంద్రంగా తయారు చేస్తానని CM చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం నౌకా నిర్మాణ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమలు, మౌలిక వసతులపై అధికారులతో CM సమీక్ష నిర్వహించారు. ‘కార్గో హ్యాండ్లింగ్ కోసం లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. పోర్టులు, ఎయిర్‌పోర్టులను ఎకనమిక్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. పెట్టుబడులు రాబట్టేందుకు మారిటైమ్ పాలసీిని మారుస్తాం’ అని పేర్కొన్నారు.