News August 11, 2025
అరుదైన వ్యాధి: ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే!

రాజస్థాన్‌లో మోడ్రన్ కుంభకర్ణుడిగా పేరుగాంచిన పుర్ఖారామ్ అనే 46 ఏళ్ల వ్యక్తి నెలలో 25 రోజులు నిద్రపోయే ఉంటారు. ఆయనకు 23 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. యాక్సిస్ హైపర్సోమ్నియా అనే ఈ నరాల సంబంధిత వ్యాధి వల్ల ఆయన ఏకధాటిగా నిద్రపోతుంటారు. మిగిలిన ఐదు రోజులు మాత్రమే తన వ్యాపారం చేసుకుంటున్నారు. నిద్రలోనే కుటుంబీకులు అతనికి తినిపించడం, స్నానం చేయించడం చేస్తుంటారు.
Similar News
News April 17, 2026
రాహుల్ గాంధీకి షాక్

రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టు షాకిచ్చింది. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఆయనపై FIR నమోదు చేయాలని ఆదేశించింది. కాగా రాహుల్‌కు బ్రిటీష్ పౌరసత్వం కూడా ఉందని కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ 2024లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉంటే దాన్ని ద్వంద్వ పౌరసత్వం అంటారు. భారత రాజ్యాంగం ప్రకారం ఇది నిషేధం.
News April 17, 2026
హీరోయిన్ పెళ్లి వార్తలు.. ఖండించిన తల్లి

మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్‌తో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి వార్తలను ఆమె తల్లి లిస్సీ ఖండించారు. వారి మ్యారేజ్ కోసం ఎదురుచూస్తున్నామంటూ ఓ వ్యక్తి SMలో చేసిన కామెంట్‌కు ఆమె ‘ఫాల్స్ న్యూస్’ అని ఆన్సరిచ్చారు. 2022లో వచ్చిన హృదయం మూవీలో వీరిద్దరూ మ్యారీడ్ కపుల్‌గా నటించారు. ఆ సమయంలో ప్రేమ చిగురించిందని రూమర్లు వచ్చాయి. కాగా గతేడాది లోక: చాప్టర్-1తో కళ్యాణి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
News April 17, 2026
మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్ర ఇదే

మహిళా రిజర్వేషన్ ప్రస్తావన రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలోనే (1946-49) వచ్చినా అది సాధ్యపడలేదు. 1996లో దేవెగౌడ ప్రభుత్వం 33% రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టగా గందరగోళం నెలకొంది. 1998-2003 మధ్య నాలుగుసార్లు సేమ్ సీన్ రిపీటైంది. 2010లో మళ్లీ UPA ప్రభుత్వం మొదట రాజ్యసభలో ఆమోదించినా ఆ తర్వాత జాప్యం వల్ల అమలులోకి రాలేదు. 2023లో ఈ బిల్లుకు ఆమోదం లభించగా దీనికి సవరణలు చేపట్టి కేంద్రం మరోసారి తీసుకొచ్చింది.


