News March 31, 2024

బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది: షర్మిల

image

AP: దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. ‘బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు.. ఆ పార్టీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకూడదన్నది బీజేపీ ప్రభుత్వ కుట్ర. ఓటమి భయంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. అదానీ, అంబానీల అనుచరులకు జగన్ పదవులు కట్టబెడుతున్నారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 6, 2024

రూ.2,000 రావాలంటే ఇలా చేయాల్సిందే..

image

ప్రధాని మోదీ నిన్న పీఎం కిసాన్ 18వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈకేవైసీ పూర్తైన అకౌంట్లలో మాత్రమే రూ.2వేలు జమయ్యాయి. ఇంకా ఎవరికైనా జమ కాకుంటే PM కిసాన్ పోర్టల్ ద్వారా OTP ఎంటర్ చేసి KYC పూర్తి చేసుకోవచ్చు. లేదంటే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.
>>SHARE IT

News October 6, 2024

అభిమాని కోరిక నెరవేర్చిన సీఎం చంద్రబాబు

image

AP: క్యాన్సర్ ఫైనల్ స్టేజీలో ఉన్న ఓ అభిమాని ఆకాంక్షను సీఎం చంద్రబాబు నెరవేర్చారు. రేణిగుంటకు చెందిన దివ్యాంగుడు సురేంద్రబాబు(30) క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఒక్కసారైనా చంద్రబాబుతో ఫొటో దిగాలనే కోరికను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డికి తెలిపారు. ఈ క్రమంలో తిరుమల పర్యటన ముగించుకుని రేణిగుంటకు వచ్చిన CM దగ్గరకు సురేంద్రను తీసుకెళ్లారు. CM అతనితో ఫొటో దిగి రూ.5 లక్షల చెక్కును అందించారు.

News October 6, 2024

World Bankకు సలహాలిచ్చే స్థాయికి భారత్: ఫేమస్ ఎకానమిస్ట్

image

సలహాలు తీసుకోవడం మానేసి ప్రపంచ బ్యాంకుకే సలహాలు ఇచ్చే స్థితికి భారత్ చేరిందని ఎకానమిస్ట్ జగదీశ్ భగవతి అన్నారు. ‘మనమిప్పుడు సరికొత్త యుగానికి చేరాం. నాయకత్వమే కీలకం. గతంలో పాలసీలు, ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా దేశం వెనకబడే ఉండేది. కరెక్ట్ టైమ్‌లో మోదీ PM కావడం అదృష్టం. వ్యవస్థలు మారాలని ఆయన ముందు నుంచే చెప్తున్నారు. కేంబ్రిడ్జ్ సహా మేధావులకు లేని కన్విక్షన్ ఆయన సొంతం. అందుకే ఆయనిష్టం’ అని చెప్పారు.