News August 10, 2025
‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల సునామీ

‘మహావతార్ నరసింహ’ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వరుసగా సెలవులు రావడంతో జనం సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. నిన్నటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ Xలో తెలిపింది. ‘మహావతార్ నరసింహ’ చరిత్ర తిరగరాస్తోందని, గర్జన అన్‌స్టాపబుల్ అని పేర్కొంది. కాగా దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది.
Similar News
News August 13, 2025
పాక్ F16 జెట్ల నష్టంపై US దాటవేత

Op సిందూర్‌లో F16 జెట్లను పాక్ నష్టపోయిందా అన్న ప్రశ్నను US దాటవేసింది. దీనిని పాక్‌తోనే చర్చించాలంటూ NDTVకి జవాబిచ్చింది. నిజానికి దాయాది దేశంలోని ఈ జెట్ల టెక్నికల్ ఆపరేషన్స్, రిపేర్లన్నీ US కాంట్రాక్టర్లే చూస్తారు. 24/7 వారు నిఘా ఉంచుతారు. వీటిని ఉపయోగించాలన్నా ఒప్పందం ప్రకారం వారి అనుమతి తీసుకోవాలి. 2019లో బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ తర్వాత జెట్స్ సురక్షితంగా ఉన్నాయని ఇదే US చెప్పడం గమనార్హం.
News August 13, 2025
ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు IOA ఆమోదం

2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ బిడ్డింగ్‌కు భారత ఒలింపిక్ సంఘం(IOA) ఆమోదం తెలిపింది. అవకాశం వస్తే అహ్మదాబాద్ వేదికగా ఈ క్రీడలు నిర్వహించాలని భారత్ యోచిస్తోంది. కాగా బిడ్డింగ్ దాఖలుకు ఆగస్టు 31 వరకు అవకాశం ఉంది. ఇదే సమయంలో నిర్వహణ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు కెనడా తాజాగా ప్రకటించడంతో భారత్‌కు అవకాశాలు మెరుగుపడ్డాయి.
News August 13, 2025
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం తేదీల ప్రకటన

AP: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 6న అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 7వ తేదీన సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ప్రకటించారు. అక్టోబర్ 14న జరిగే తెప్పోత్సవంతో జాతర ముగుస్తుందని తెలిపారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.