News August 10, 2025
రాత్రి వేళ యూరిన్ ఎక్కువగా వస్తుందా?

రాత్రిళ్లు యూరిన్ ఎక్కువగా రావడాన్ని నోక్టురియా అంటారని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో వయస్సు పెరిగే కొద్దీ లేదా నీళ్లు ఎక్కువగా తాగితే యూరిన్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే డయాబెటిస్, యూరిన్ ఇన్ఫెక్షన్, ప్రోస్టేట్ వంటి సమస్యలు ఉన్నా ఇలా జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. యూరిన్ లీకవ్వడం, బ్లడ్ రావడం, కాళ్ల వాపులు వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Similar News
News August 13, 2025
రీ పోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం: అవినాశ్

AP: 2 కేంద్రాల్లో రీ పోలింగ్ అంటూ ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్య తీసుకుందని YCP MP అవినాశ్ రెడ్డి విమర్శించారు. తాము 15 చోట్ల కోరితే 2 చోట్ల పోలింగ్ చేపట్టారని, దీన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. ‘కోర్టుకు ఏదో కారణం చెప్పడానికే రీ పోలింగ్ చేపట్టింది. ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగ ఓట్లు వేశారు. ఇలాంటి ఎన్నిక ఎక్కడా జరిగి ఉండదు. పులివెందులలో బాబు కొత్త సంస్కృతి తీసుకొచ్చారు’ అని ఫైర్ అయ్యారు.
News August 13, 2025
వచ్చే నెల ట్రంప్‌తో మోదీ భేటీ?

PM మోదీ వచ్చే నెల USలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(UNGA) సమ్మిట్‌లో భాగంగా SEP 23 నుంచి జరిగే హైలెవల్ మీటింగ్‌లో PM పాల్గొంటారని సమాచారం. ఆ సమయంలో US ప్రెసిడెంట్ ట్రంప్‌ని కలిసి ట్రేడ్ డీల్, టారిఫ్స్‌పై చర్చించే అవకాశముంది. అలాగే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీని కూడా PM కలవొచ్చని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.
News August 13, 2025
‘నవోదయ’లో ప్రవేశాలు.. నేడే చివరి తేదీ

దేశ వ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో(JNV) ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి తేదీ. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఇటీవలే గడువు ముగియగా విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా మళ్లీ పొడిగించారు. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ <