News August 13, 2025
రీ పోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం: అవినాశ్

AP: 2 కేంద్రాల్లో రీ పోలింగ్ అంటూ ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్య తీసుకుందని YCP MP అవినాశ్ రెడ్డి విమర్శించారు. తాము 15 చోట్ల కోరితే 2 చోట్ల పోలింగ్ చేపట్టారని, దీన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. ‘కోర్టుకు ఏదో కారణం చెప్పడానికే రీ పోలింగ్ చేపట్టింది. ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగ ఓట్లు వేశారు. ఇలాంటి ఎన్నిక ఎక్కడా జరిగి ఉండదు. పులివెందులలో బాబు కొత్త సంస్కృతి తీసుకొచ్చారు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News April 18, 2026
ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు

హార్ముజ్‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు ఇండియన్ నౌకలపై IRGC కాల్పులు <<19684352>>జరపడాన్ని<<>> భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నాయి. కాగా దాడులకు గురైన నౌకలోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
News April 18, 2026
వేగంగా కోలుకుంటున్నా.. త్వరలోనే యాక్షన్‌లోకి: వరుణ్ తేజ్

‘బరి’ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ <<19657793>>గాయపడిన<<>> మెగా హీరో వరుణ్ తేజ్ తన హెల్త్ అప్డేట్ వెల్లడించారు. సర్జరీ తర్వాత వేగంగా రికవరీ అవుతున్నానని ఇన్‌స్టాలో తెలిపారు. ఫుల్ స్ట్రెంత్‌తో తిరిగొస్తానని పేర్కొన్నారు. గతంలో కంటే బలంగా త్వరలోనే యాక్షన్‌లోకి దిగుతానన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ థాంక్స్ చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని సోదరి నిహారిక నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
News April 18, 2026
అభిషేక్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ

IPL: చెన్నైతో మ్యాచులో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతూ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అందులో 4 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ‘పులి’కి IPLలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అటు హెడ్ (20 బంతుల్లో 23), ఇషాన్ కిషన్ (0) ఔటయ్యారు. ప్రస్తుతం 6 ఓవర్లలో స్కోర్ 75/2గా ఉంది.


