News August 11, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* బెంగళూరులో 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ
* TG: హైదరాబాద్ బస్తీల్లో పర్యటించిన సీఎం రేవంత్
* అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు: భట్టి
* తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతాం: ఉత్తమ్
* AP: డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం: పవన్ కళ్యాణ్
* చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు: జగన్
* రేపు పీఎం ఫసల్ బీమా యోజన నిధులు విడుదల

Similar News

News August 13, 2025

మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్

image

బంగారం దిగుమతులపై ఎలాంటి టారిఫ్‌లు విధించమని ట్రంప్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ధరలు తగ్గాయి. దీంతో HYD బులియన్ మార్కెట్‌లోనూ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.50 తగ్గి రూ.1,01,350కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.50 పతనమై రూ.92,900 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,25,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 13, 2025

SHAI HOPE: మోస్ట్ అండర్ రేటెడ్ వన్డే ప్లేయర్!

image

పాక్‌తో మూడో వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ (120*) సెంచరీ బాదారు. దీంతో విండీస్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన మూడో క్రికెటర్‌గా హోప్(18) రికార్డులకెక్కారు. ప్రస్తుత వన్డే క్రికెట్‌లో హోప్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్‌గా మిగిలిపోయారు. 137 ఇన్నింగ్సుల్లోనే 50.24 సగటుతో 18 సెంచరీలు, 29 ఫిఫ్టీలతో 5,879 రన్స్ బాదారు. ఆమ్లా, కోహ్లీ, బాబర్, డివిలియర్స్‌కు మాత్రమే అతడి కంటే మెరుగైన గణాంకాలు ఉన్నాయి.

News August 13, 2025

భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

image

తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, చెట్లు, కరెంట్ స్తంభాల కింద నిల్చోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ‘నీరు నిలిచిన ప్రాంతాల్లో వాహనాలు నడపడం ప్రమాదకరం. సెల్లార్‌లోకి వరద చేరినప్పుడు షార్ట్ సర్క్యూట్ కాకుండా మెయిన్ ఆఫ్ చేయాలి. విష జ్వరాలు రాకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి’ అని చెబుతున్నారు.