News August 11, 2025

ఈ నెల 26న విశాఖలో రెండు యుద్ధనౌకల జలప్రవేశం

image

AP: ప్రాజెక్ట్ 17ఏలో తయారైన ఉదయగిరి(F35), హిమగిరి(F34) ఈ నెల 26న విశాఖలో జలప్రవేశం చేయనున్నాయి. వైజాగ్ నుంచి రెండు ప్రధాన యుద్ధ నౌకలు జలాల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారని నేవీ అధికారులు తెలిపారు. ఉదయగిరిని ముంబైకి చెందిన MDL, హిమగిరిని కోల్‌కతాకు చెందిన GRSE రూపొందించాయి. వీటి రాకతో నౌకాదళం మరింత బలోపేతం కానుంది. ఉదయగిరి నేవీ వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ షిప్.

Similar News

News August 16, 2025

TG వాహనాలకు ఇయర్లీ పాస్ ఎప్పుడంటే?

image

TG: నిన్నటి నుంచి దేశంలో ఫాస్టాగ్ <<17409246>>ఇయర్లీ పాస్<<>> అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ వాహనాలకు మాత్రం ఇంకా పాస్ అందుబాటులోకి రాలేదు. వాహన్ డేటా బేస్‌లో TG వాహనాల వివరాలను మెర్జ్ చేయకపోవడంతో సమస్య తలెత్తింది. కేంద్రం ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సురేంద్ర మోహన్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆగస్టు 20కల్లా రాష్ట్రంలో ఇయర్లీ పాస్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

News August 16, 2025

SSMB29 మూవీపై క్రేజీ అప్డేట్!

image

మహేశ్‌బాబు-రాజమౌళి కాంబోలో SSMB29 చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేశ్ బర్త్‌డో రోజు సెట్స్‌లో ప్రియాంకతో ఉన్న ఫొటో తాజాగా వైరలవుతోంది. ఇప్పుడు మరో అప్‌డేట్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో నైరోబీ, టాంజానియాలో నాలుగో షెడ్యూల్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ప్యాన్ వరల్డ్ రేంజ్‌లో జక్కన్న ఈ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

News August 16, 2025

పెట్రోల్, డీజిల్ GST పరిధిలోకి రానట్లేనా?

image

GST <<17418489>>శ్లాబులను<<>> తగ్గిస్తామన్న కేంద్రం ప్రతిపాదనతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం ఇష్టపడట్లేదని జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం పెట్రోల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సెస్ వసూలు చేస్తున్నాయి. అన్నీ కలిపి పన్నులు 50% వరకు ఉన్నాయి. ఒకవేళ GSTలోకి తెస్తే 28% శ్లాబులోకి రావొచ్చు.