News August 11, 2025

దానం చేసిన దేశమే సాయం కోరుతోంది!

image

ISRO అంతరిక్ష పరిశోధనల్లో దూసుకుపోతోంది. ఒకప్పుడు అమెరికా దానం చేసిన చిన్న రాకెట్‌తోనే 1963లో ఇస్రో అంతరిక్ష పరిశోధనలు ప్రారంభించింది. ఇప్పుడు అదే దేశం స్పేస్ ప్రోగ్రామ్స్‌కు మన సాయం కోరుతోంది. ప్రపంచంలోనే ఖరీదైన శాటిలైట్‌ NISARను డెవలప్ చేయడానికి, లాంచ్ చేయడానికి NASA ఇస్రోపైనే ఆధారపడింది. ఇప్పుడు మరో భారీ <<17366188>>శాటిలైట్‌<<>> లాంచ్‌ బాధ్యతనూ ISROకే అప్పగించింది. తక్కువ ఖర్చు, సక్సెస్ రేటే ఇందుకు కారణం.

Similar News

News August 11, 2025

వీడిన భయాలు.. భారీ లాభాల్లో మార్కెట్లు

image

ట్రంప్ టారిఫ్స్ భయాల నుంచి కోలుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 746 పాయింట్లు లాభపడి మళ్లీ 80,604, నిఫ్టీ 221 పాయింట్లు వృద్ధి చెంది 24,585 వద్ద క్లోజ్ అయ్యాయి. టాటా మోటార్స్, ఎటర్నల్, ట్రెంట్, SBI, అల్ట్రాటెక్ సిమెంట్, L&T, అదానీ పోర్ట్స్, రిలయన్స్, కోటక్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. బెల్, ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

News August 11, 2025

మరికాసేపట్లో వర్షం

image

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరికాసేపట్లో వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 1-2 గంటల్లో ఎల్బీ నగర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో వాన పడుతుందని అంచనా వేసింది. అదే విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News August 11, 2025

ఆసిమ్ మునీర్ బెదిరింపులు.. భయపడేది లేదన్న భారత్

image

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ <<17364906>>వ్యాఖ్యలపై<<>> కేంద్రం తీవ్రంగా స్పందించింది. అమెరికా నుంచి ఆయన ప్రేలాపనలు చేయడం సిగ్గుచేటని మండిపడింది. అణుదాడి చేస్తామన్న బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది. అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా రెచ్చిపోవడం పాక్ ఆర్మీ చీఫ్‌కు అలవాటుగా మారిందని భారత్ విమర్శించింది.