News August 11, 2025

భారత్‌లో వరల్డ్ కప్.. కౌంట్‌డౌన్ స్టార్ట్

image

భారత్‌లో మరో క్రికెట్ సంగ్రామానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. Sept 30న మొదలయ్యే మహిళల వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి మరో 50 రోజులే ఉండటంతో నేడు ICC ట్రోఫీ టూర్‌ను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో ICC ఛైర్మన్ జై షా, BCCI సెక్రటరీ సైకియా, మాజీ స్టార్లు యువరాజ్, మిథాలీ రాజ్, మహిళా క్రికెటర్లు హర్మన్, స్మృతి, జెమీమా పాల్గొన్నారు. కాగా టోర్నీకి అతిథ్యమివ్వనున్న అన్ని నగరాల్లో ట్రోఫీ టూర్ నిర్వహించనున్నారు.

Similar News

News August 11, 2025

సంచలనం: 5 బంతుల్లోనే టార్గెట్ ఛేదించారు

image

అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్ 2025లో సంచలనం నమోదైంది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో కెనడా 5 బంతుల్లో టార్గెట్‌ను ఛేజ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా 19 ఓవర్లు ఆడి 23 పరుగులే చేసింది. ఏడుగురు డకౌటయ్యారు. కెనడా బౌలర్ జగ్‌మన్‌దీప్ 6 వికెట్లు తీసి 7 రన్స్ ఇచ్చారు. అనంతరం 24 పరుగుల టార్గెట్‌ను కెనడా 0.5 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ యువరాజ్ ఒక్కడే 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు.

News August 11, 2025

మోదీ, అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ

image

AP: ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో టీడీపీ ఎంపీలు సమావేశం అయ్యారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో తొలుత షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. వెంటనే నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరారు. అనంతరం ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.

News August 11, 2025

పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు ఎత్తేయాలన్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 80శాతం ఎక్స్‌టర్నల్, 20శాతం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ GO జారీ చేసింది. కాగా ఈసారి నుంచి ఇంటర్నల్స్ ఎత్తివేసి 100 మార్కులకు ప్రశ్నపత్రం రూపొందించాలని ప్రభుత్వం భావించింది. సాధ్యాసాధ్యాలపై నిపుణులతో చర్చించింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.