News August 11, 2025

రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన ‘మహావతార్ నరసింహ’

image

అశ్విన్ కుమార్ తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.210 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. హొంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రూ.300 కోట్లను క్రాస్ చేయొచ్చని సినీవర్గాలు చెబుతున్నాయి.

Similar News

News August 21, 2025

నేడు మంత్రివర్గ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతి పనుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రూ.904 కోట్లతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు ఆమోదం పలకనుందని సమాచారం. కొత్త జిల్లాల పేర్లు మార్పు, ఏర్పాటుపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

News August 21, 2025

టీమ్ ఇండియా మేనేజర్‌గా జనసేన MLA కుమారుడు

image

ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు మేనేజర్‌గా ఆంధ్రాకు చెందిన పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ప్రశాంత్ ప్రస్తుతం ఏసీఏ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లా టీమ్ ప్లేయర్‌గా రాణించారు. కాగా భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడే ప్రశాంత్. అలాగే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అల్లుడు కూడా. ఈ నెల 9 నుంచి 28 వరకు ఆయన టీమ్ ఇండియాతో పర్యటించనున్నారు.

News August 21, 2025

హైదరాబాద్ KPHBలో ఎకరం రూ.70 కోట్లు

image

TG: హైదరాబాద్‌లో KPHBలో హౌసింగ్ బోర్డు ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసింది. ఈ వేలంలో రికార్డు స్థాయిలో ఎకరం భూమి రూ.70 కోట్లు పలికింది. మొత్తం 7.8 ఎకరాలకు రూ.547 కోట్ల ఆదాయం సమకూరింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ ఈ భూములను దక్కించుకుంది.