News August 11, 2025
ASF: ‘పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాలి’

19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే పేర్కొన్నారు. సోమవారం ఆసిఫాబాద్ గిరిజన సంక్షేమ పీటీజీ బాలుర పాఠశాల, కళాశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ప్రతిఒక్కరూ జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News April 16, 2026
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి లక్ష్యం: మంత్రి అచ్చెన్న

టెక్కలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని మంత్రి అచ్చెన్న అధికారులను హెచ్చరించారు. గురువారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్, రహదారులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన డీఈ, ఏఈలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
News April 16, 2026
ఇంటి నుంచి వివరాలు నమోదు చేసుకోండి: JC

దేశంలో తొలిసారిగా డిజిటల్ జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ఈ నెల 16 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు
NTR JC ఎస్.ఇలక్కియ తెలిపారు. ప్రజలు https://se.census.gov.in� పోర్టల్ ద్వారా తమ ఇంటి నుంచే వివరాలు నమోదు చేయాలని కోరారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు ఖచ్చితమైన డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణనలో పాల్గొని జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.
News April 16, 2026
వీళ్లూ ITR ఫైల్ చేయాల్సిందే!

ITR ఫైల్ చేయడం ఆదాయంపైనే ఆధారపడి ఉండదు. కొన్ని రకాల ఖర్చులు లేదా లావాదేవీలు పరిమితి దాటితే తప్పనిసరి. *సేవింగ్స్ అకౌంట్‌లో ₹50 లక్షలు, కరెంట్ అకౌంట్‌లో ₹కోటి డిపాజిట్ చేస్తే. *ఏడాదికి కరెంటు బిల్లు ₹లక్ష దాటితే. *బిజినెస్ టర్నోవర్ ₹60 లక్షలు దాటితే. *ప్రొఫెషనల్ ఇన్కమ్ ₹10 లక్షల పైన ఉంటే. *TDS లేదా TCS రూపంలో ₹25 వేలు అంతకంటే ఎక్కువ కట్ అయితే ఆదాయం పన్ను పరిమితిలో లేకపోయినా ITR ఫైలింగ్ తప్పనిసరి.


