News August 11, 2025
సైబర్ నేరగాళ్లకు షాక్.. వెంటనే సిమ్ బ్లాక్

సైబర్ నేరగాళ్ల సిమ్ కార్డులను వెంటనే బ్లాక్ చేసేలా ఎస్పీలకు కేంద్ర ప్రభుత్వం అధికారం ఇవ్వనుంది. అనుమానితుల లొకేషన్లు, బ్యాంకు, టెలికాం వివరాలను తక్షణమే అన్ని పీఎస్‌లకు పంపేలా చర్యలు చేపట్టనుంది. దేశ వ్యాప్తంగా సైబర్ క్రైమ్‌పై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోనుంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు తెలంగాణను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. త్వరలోనే TGలో సెమినార్ నిర్వహించనుంది.
Similar News
News August 12, 2025
ఇన్‌కమ్ టాక్స్ బిల్లు-2025లో ఏం మారాయి?

ఇవాళ ఆమోదం <<17375107>>పొందిన<<>> ఇన్‌కమ్ టాక్స్ బిల్లు-2025లో కొన్ని పదాలను మార్చారు. పాత బిల్లులో ‘క్రితం సంవత్సరం, అసెస్‌మెంట్ ఇయర్’ అనే పదాల స్థానంలో ‘టాక్స్ ఇయర్’ అని రీప్లేస్ చేశారు. కొత్త పన్నులు, శ్లాబులు, ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, రేట్లనేమీ మార్చలేదు. స్టాండర్డ్ డిడక్షన్, గ్రాడ్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర సెక్షన్లు, నిబంధనలను ఒక పట్టిక రూపంలోకి తీసుకొచ్చారు. బిల్లు కోసం ఇక్కడ <
News August 12, 2025
APLలో ఇవాళ్టి మ్యాచులు ఇవే

AP: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్4 సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. నిన్న మొదటి మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్‌పై అమరావతి రాయల్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లైన్స్‌పై కాకినాడ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గం.కు భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సా.6.30గం.కు విజయవాడ సన్ షైనర్స్, సింహాద్రి వైజాగ్ లైన్స్ తలపడనున్నాయి.
News August 12, 2025
భారత్ సరిహద్దు సమీపంలో చైనా రైల్వే లైన్!

ఇండియా సరిహద్దు సమీపంలో చైనా రైల్వేలైన్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో కొంత భాగం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(LAC) సమీపంలో ఉంటుందని చెప్తున్నారు. టిబెట్‌ను షిన్‌జాంగ్ ప్రావిన్సుతో కలపనున్నారు. రూ.1.15 లక్షల కోట్ల క్యాపిటల్‌తో ‘ది షిన్‌జాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ’ని రిజిస్టర్ చేశారని చైనా మీడియాలో వార్తలొచ్చాయి. LAC సమీపంలో కాబట్టి రక్షణపరంగా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరముంది.