News August 12, 2025
మాజీ ఎమ్మెల్యేలు కన్నుమూత

AP: అన్నమయ్య(D) రాజంపేట మాజీ MLA కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1989లో రాజంపేట నుంచి INC MLAగా గెలిచారు. 1985, 1994, 2009లో పోటీ చేసి ఓడిపోయారు. అటు తిరుపతి(D) శ్రీకాళహస్తి మాజీ MLA తాటిపర్తి చెంచురెడ్డి కూడా తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1988 ఉపఎన్నికలో INC తరఫున MLAగా గెలిచారు.
Similar News
News August 12, 2025
ఎడతెరిపిలేని వర్షం

TG: హైదరాబాద్‌లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. మరో 2 గంటల పాటు వర్షం కొనసాగే ఆస్కారం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. అటు నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, జనగామ, యాదాద్రి జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది.
News August 12, 2025
సర్వం సిద్ధం.. ఉ.7 గంటల నుంచే పోలింగ్

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల ఉప ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉ.7 గంటల నుంచి సా.5 వరకు పోలింగ్ జరగనుంది. పులివెందులలో 10,601 మంది ఓటర్ల కొరకు 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 24,606 మంది ఓటర్ల కోసం 30 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. రెండు మండలాల్లో 1400 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. నిన్న సాయంత్రమే స్థానికేతరులను గుర్తించి పంపేశారు.
News August 12, 2025
TG అప్పులు రూ.3.50 లక్షల కోట్లు: కేంద్రం

TG: 2024 మార్చి 31నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.3,50,520.39 కోట్లని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. MP రఘునందన్‌రావు ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. పదేళ్లలో BRS ప్రభుత్వం రూ.3,14,545 కోట్లు అప్పు చేసినట్లు తేల్చింది. 2014-15లో రాష్ట్ర అప్పులు రూ.69,603.87 కోట్లు, ఆస్తులు రూ.83,142.68 కోట్లుగా ఉన్నాయి. 2023-2024నాటికి అప్పులు రూ.3,50,520.39 కోట్లు, ఆస్తులు రూ.4,15,099.69 కోట్లకు పెరిగాయి.