News August 12, 2025

భారత్ ఎవరికీ తలవంచదు: చంద్రబాబు

image

AP: పీఎం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం శక్తిమంతంగా ఎదుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. భారత్ ఎవరికీ తల వంచదని, దేశం జోలికి ఎవరొచ్చినా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. విజయవాడలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘టారిఫ్స్ విధిస్తే భారత్ ఆగిపోతుందనుకోవడం భ్రమే. మనకు ఉద్యోగాలు ఇవ్వని దేశాల్లోనే అభివృద్ధి నిలిచిపోతుంది. ఇప్పుడు ఉన్నది పవర్ ఫుల్ ఇండియా’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News August 12, 2025

డీఎస్సీ ఫలితాలు.. అభ్యర్థులకు అలర్ట్

image

AP: మెగా DSC <<17374210>>ఫలితాలు<<>> నిన్న రాత్రి విడుదలయ్యాయి. DSC నార్మలైజేషన్, టెట్ వెయిటేజీ మార్కులు కలిపి విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది. టెట్ మార్కులపై అభ్యంతరాలుంటే అప్డేట్ చేసుకునేందుకు ఇవాళ, రేపు అవకాశం కల్పించింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత సవరించిన తుది మార్కులను రిలీజ్ చేయనుంది. అనంతరం జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడించే ఛాన్స్ ఉంది.

News August 12, 2025

ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 5 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ APలోని ఉమ్మడి ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారముందని పేర్కొంది. అటు TGలోనూ HYD, KNR, MHBD, మహబూబ్ నగర్, NLG తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.

News August 12, 2025

ఎడతెరిపిలేని వర్షం

image

TG: హైదరాబాద్‌లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. మరో 2 గంటల పాటు వర్షం కొనసాగే ఆస్కారం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. అటు నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, జనగామ, యాదాద్రి జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది.