News August 12, 2025
ఓటింగ్‌ను ప్రభావితం చేసే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాం: డీఐజీ

AP: పులివెందుల, ఒంటిమిట్టలో శాంతియుతంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు కడప డీఐజీ ప్రవీణ్ తెలిపారు. ఓటింగ్‌ను ప్రభావితం చేసే వ్యక్తులను ఉదయాన్నే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇరు చోట్ల భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ ఉదయం వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News August 20, 2025
‘ఫౌజీ’ ఫొటో లీక్.. మేకర్స్ ఫైర్

డార్లింగ్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు లీక్ చేయడంపై మేకర్స్ ఫైర్ అయ్యారు. ‘సెట్స్‌లోని ఫొటోను షేర్ చేస్తున్నట్లు గుర్తించాం. మీకు ఉత్తమ అనుభవాన్ని అందించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఇలాంటి లీకులు వాటిని దెబ్బతీస్తాయి. షేర్ చేసిన వారి అకౌంట్స్‌ను బ్లాక్ చేయించి, సైబర్ క్రైమ్ కేసులు పెడతాం’ అని హెచ్చరించారు.
News August 20, 2025
మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్

బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.600 తగ్గి రూ.1,00,150కు చేరింది. 11 రోజుల్లో మొత్తం ₹3,160 తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.550 పతనమై రూ.91,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 తగ్గి రూ.1,25,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News August 20, 2025
ప్రియుడిని పెళ్లి చేసుకున్న ‘జేజమ్మ’

‘అరుంధతి’లో చిన్ననాటి జేజమ్మగా నటించిన దివ్య నగేశ్ పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ అజిత్ కుమార్‌తో ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ అమ్మడు ఈ నెల 18న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. సింగం పులి, అపరిచితుడు చిత్రాల్లో దివ్య నటించారు. అరుంధతిలో నటనకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నారు.