News August 12, 2025
జమ్మలమడుగు ఓటర్లతో టీడీపీ రిగ్గింగ్: YCP

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. జమ్మలమడుగు నుంచి వచ్చిన స్థానికేతర ఓటర్లు నల్లపురెడ్డి పల్లె గ్రామంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ పొన్నతోట మల్లి ఓటేసేందుకు పోలింగ్ కేంద్రం వద్ద లైనులో నిలబడిన ఫొటోను వైసీపీ ట్వీట్ చేసింది.
Similar News
News August 12, 2025
బీఆర్ఎస్ బీసీ సభ వాయిదా

TG: ఈనెల 14న కరీంనగర్‌లో BRS నిర్వహించతలపెట్టిన బీసీ సభ వాయిదా పడింది. అల్పపీడనం కారణంగా 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు. సభ తదుపరి నిర్వహణ తేదీని త్వరలో ఖరారు చేస్తామని వెల్లడించారు. కాగా ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది.
News August 12, 2025
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: 3 శాఖల్లో 21 ఉద్యోగాలకు APPSC <
News August 12, 2025
చిన్న మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది!

ప్రస్తుతం భారీ రెమ్యూనరేషన్లు తీసుకునే పెద్ద హీరోలతో ₹వందల కోట్లు వెచ్చించి సినిమా తీసి, టికెట్ ధరలు పెంచుకున్నా ₹200 కోట్లు రాబట్టడం గగనమైపోతోంది. అలాంటిది ఏ హడావిడి లేకుండా వచ్చిన ‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని ₹15కోట్లతో రూపొందించగా ఇప్పటికే ₹225 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. క్వాలిటీ ప్రజెంటేషన్ సినిమాను బాక్సాఫీస్ వద్ద నిలబెడుతుందని ఇది నిరూపించింది.