News August 12, 2025
జమ్మలమడుగు ఓటర్లతో టీడీపీ రిగ్గింగ్: YCP

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. జమ్మలమడుగు నుంచి వచ్చిన స్థానికేతర ఓటర్లు నల్లపురెడ్డి పల్లె గ్రామంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ పొన్నతోట మల్లి ఓటేసేందుకు పోలింగ్ కేంద్రం వద్ద లైనులో నిలబడిన ఫొటోను వైసీపీ ట్వీట్ చేసింది.
Similar News
News April 19, 2026
PM మోదీ ప్రోత్సాహం నాకు బలం: పవన్

AP: తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న <<19688324>>PM మోదీకి<<>> Dy.CM పవన్ ధన్యవాదాలు తెలిపారు. ‘నాతో మాట్లాడేందుకు సమయం కేటాయించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. త్వరగా కోలుకోవాలని మీరు తెలిపిన విషెస్, మీరిచ్చే ప్రోత్సాహం నాకు గొప్ప బలాన్నిస్తాయి. మీ మద్దతు, మార్గదర్శకత్వానికి కృతజ్ఞుడినై ఉంటా’ అని పవన్ ట్వీట్ చేశారు. పవన్ త్వరగా కోలుకోవాలని CM CBN, మంత్రి లోకేశ్, మాజీ సీఎం జగన్, KTR తదితరులు Xలో పోస్టులు పెట్టారు.
News April 19, 2026
KKR జట్టులో చేరిన స్టార్ బౌలర్

IPL: KKR జట్టులో స్టార్ బౌలర్ మతీశ పతిరణ జాయిన్ అయ్యారు. శ్రీలంక క్రికెట్ బోర్డ్ NOC ఇవ్వడంతో ఆయన తాజాగా తమ క్యాంపులోకి ఎంట్రీ ఇచ్చినట్లు KKR యాజమాన్యం ప్రకటించింది. డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ఈ బౌలర్ రాకతో అయినా KKR ఫేట్ మారుతుందేమో చూడాలి. అయితే ఇవాళ RRతో జరిగే మ్యాచులో అతను ఆడతారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఈ సీజన్‌లో KKR ఆడిన 5 మ్యాచుల్లోనూ ఓడగా ఒకటి రద్దయింది.
News April 19, 2026
చిన్న పొరపాటు చేసినా తీవ్రస్థాయిలో దాడి: ఇరాన్

అమెరికాతో దౌత్యానికైనా, పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ స్పష్టం చేశారు. తాము యుద్ధంలో గెలిచేశామని, ఇప్పుడు చర్చలకు రెడీగా ఉన్నామని తెలిపారు. ఈ సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, చిన్న పొరపాటు చేసినా తీవ్ర స్థాయిలో బదులిస్తామన్నారు. గత సంఘర్షణలతో పోలిస్తే ఇరాన్ సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు.


