News August 12, 2025
వామన్ రావు హత్యకేసు సీబీఐకి అప్పగించాలి: సుప్రీంకోర్టు

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్ రావు దంపతుల <<6352207>>హత్య<<>> కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్ కిషన్ రావుకు భద్రత కల్పించాలని సూచించింది. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇప్పటికే స్పష్టం చేశారు.
Similar News
News April 16, 2026
మూడు బిల్లులపై రేపు ఓటింగ్

లోక్‌సభలో రేపు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కేంద్రం <<19663696>>ప్రవేశపెట్టిన<<>> యూటీ చట్ట సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రేపు సా.4 గంటలకు ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. అప్పటివరకు సభలో చర్చ జరుగుతుందని, అన్నిపార్టీల సభ్యులకు మాట్లాడేందుకు అనుమతి ఇస్తామన్నారు. బిల్లులకు ఆమోదం లభిస్తుందో, లేదో రేపు ఓటింగ్ అనంతరం తేలిపోనుంది. ఎల్లుండి రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుంది.
News April 16, 2026
ఎండల సెగ.. కళ్లు జాగ్రత్త!

తీవ్ర ఎండలు, వేడి గాలుల వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయి. డ్రై ఐస్, అలర్జీలు, కంటి కలకలు కామన్‌గా కనిపిస్తున్నాయి. ఇవి రాకుండా ఉండాలంటే రోజుకు 4 లీటర్ల నీళ్లు తాగాలని, బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కళ్లను రుద్దకూడదు. విశ్రాంతి ఇవ్వాలి. క్యారెట్, బొప్పాయి లాంటి విటమిన్-A ఫుడ్స్ తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే సొంత వైద్యం కాకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి.
News April 16, 2026
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం: అసద్

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెంచుతూ చేపట్టే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో విమర్శించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. సమాఖ్య వ్యవస్థకు ఇది విరుద్ధంగా ఉందని దుయ్యబట్టారు. దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.


