News August 12, 2025

వామన్ రావు హత్యకేసు సీబీఐకి అప్పగించాలి: సుప్రీంకోర్టు

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్ రావు దంపతుల <<6352207>>హత్య<<>> కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్‌ కిషన్ రావుకు భద్రత కల్పించాలని సూచించింది. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇప్పటికే స్పష్టం చేశారు.

Similar News

News April 16, 2026

‘దోశ, ఇడ్లీ..’ పాట.. BCCIకి CSK ఫిర్యాదు!

image

బెంగళూరు వేదికగా ఏప్రిల్ 5న RCBతో జరిగిన మ్యాచ్‌లో DJ ‘దోశ, ఇడ్లీ, సాంబార్’ పాటను ప్లే చేయడాన్ని CSK మేనేజ్మెంట్ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఫిర్యాదు చేస్తూ BCCIకి లెటర్ రాసినట్లు ఫ్రాంచైజీ MD కాశీ విశ్వనాథన్ తెలిపారు. తమ ప్లేయర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, స్టేడియంలో వాతావరణం ఏమాత్రం బాగోలేదని ఆయన తెలిపారు. దీనిపై విచారణ జరుపుతామని IPL గవర్నింగ్ కౌన్సిల్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

News April 16, 2026

నదిలో నాణేలు వేస్తున్నారా? ఈ విషయం మీకు తెలుసా?

image

నదిలో నాణేలు వేయడానికి ఆది/మంగళ వారాలు ప్రశస్తమైనవని పండితులు చెబుతున్నారు. స్నానాంతరం శుభ్రమైన దుస్తులు ధరించి, తూర్పు ముఖంగా ఉంటూ, కులదైవాన్ని ప్రార్థిస్తూ ఈ పరిహారం పాటించాలి. రాగి నాణేన్ని ప్రవహించే నీటిలోనే వేయాలి. అది నీటి ప్రవాహంతో పాటు ముందుకు సాగిపోతే జాతక దోషాలు తొలగి పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. పూర్వం నీటి శుద్ధి కోసం రాగిని వాడే ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోందంటున్నారు పండితులు.

News April 16, 2026

అందరి చూపూ పార్లమెంట్ సమావేశాలపైనే..

image

ఎన్నడూ లేనంతగా యావత్ దేశం పార్లమెంట్ సమావేశాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మహిళా రిజర్వేషన్‌తో పాటు డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడమే అందుకు కారణం. మహిళా బిల్లుకు అందరూ ఓకే అంటున్నా డీలిమిటేషన్‌ను మాత్రం ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కాసేపట్లో కేంద్రమంత్రి అర్జున్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును LSలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చ జరగనుంది. సాయంత్రం PM మోదీ ప్రసంగిస్తారు.