News August 12, 2025
‘రావు బహదూర్’ పాత్రలో సత్యదేవ్.. ఫస్ట్ లుక్ చూశారా?

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ మరో విలక్షణ పాత్ర కోసం తనని తాను మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వెంకటేశ్ మహా తెరకెక్కిస్తోన్న ‘రావు బహదూర్’ సినిమాలో టైటిల్ క్యారెక్టర్‌లో ఆయన నటిస్తున్నారు. ‘గుర్తుంచుకోండి. అనుమానం పెనుభూతం’ అంటూ తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. వచ్చే సమ్మర్లో సినిమా రిలీజ్ చేస్తారు. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్‌బాబు సమర్పిస్తున్నారు.
Similar News
News April 17, 2026
ఆ తప్పులు సరిదిద్దేందుకే డీలిమిటేషన్: షా

దేశంలో 127 నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని కేంద్రమంత్రి అమిత్ షా LSలో అన్నారు. ‘ఒక దగ్గర 38 లక్షల మంది ఓటర్లు ఉంటే మరో చోట 6 లక్షల మంది ఉన్నారు. ఇలాంటి నియోజకవర్గాలు దేశంలో చాలా ఉన్నాయి. డీలిమిటేషన్ వల్ల ఇలాంటి తప్పులను సరిదిద్దవచ్చు. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ కావాలనే డీలిమిటేషన్ ఆపింది. జనాభా లెక్కలకు డీలిమిటేషన్‌ను మేం లింక్ చేయలేదు. కాంగ్రెస్సే చేసింది’ అని స్పష్టంచేశారు.
News April 17, 2026
దిగుమతుల్లో గోల్డ్, సిల్వర్ సరికొత్త రికార్డ్

2025-26లో దేశంలో బంగారం, వెండి దిగుమతుల విలువ జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే బంగారం దిగుమతి విలువ $71.98 బిలియన్లకు పెరిగింది. అయితే పరిమాణం పరంగా 4.76% తగ్గి 721.03 టన్నులకు క్షీణించింది. వెండి దిగుమతి విలువ 150% పెరిగి $12Bకు (7,344.96 టన్నులు) చేరింది. మరోవైపు 15 బ్యాంకులకు గోల్డ్, సిల్వర్ దిగుమతులపై అనుమతిని 2029 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
News April 17, 2026
2 రాష్ట్రాల ఎన్నికలు.. రూ.865 కోట్లు సీజ్

అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్, తమిళనాడులో ఇప్పటి వరకు రూ.865 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ECI వెల్లడించింది. ఇందులో రూ.99 కోట్ల నగదు, రూ.84 కోట్ల విలువైన 32.91 లక్షల లీటర్ల లిక్కర్ ఉన్నాయని తెలిపింది. అలాగే రూ.174 కోట్ల డ్రగ్స్, రూ.159 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.350 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు పేర్కొంది.


