News August 13, 2025
జాగ్రత్త.. నేటి నుంచే అతి భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఇరు రాష్ట్రాల అధికారులు ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు, రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది?
Similar News
News August 14, 2025
భూధార్ నంబర్ల కేటాయింపుపై అధికారులకు CM ఆదేశాలు

TG: భూములకు భూధార్ నంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన వారసత్వ, ఇతర మ్యుటేషన్ల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సమీక్ష సమావేశంలో సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో కొత్తగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు.
News August 14, 2025
RBI కీలక నిర్ణయం.. గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్

బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్‌పై RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ ప్రక్రియకు 2 రోజుల సమయం పడుతుండగా తాజా నిర్ణయంతో కొన్ని గంటల్లోనే క్లియరెన్స్ రానుంది. ఈ విధానం అక్టోబర్ 4 నుంచి తొలి దశలో, వచ్చే ఏడాది జనవరి 3 నుంచి రెండో దశలో అమల్లోకి వస్తుంది. ఇందుకోసం ట్రంకేషన్ సిస్టమ్‌లో RBI మార్పులు చేయనుంది. దీంతో బ్యాంకు పని వేళల్లోనే చెక్కును స్కాన్ చేసి కొన్ని గంటల్లోనే పాస్ చేయనున్నాయి.
News August 14, 2025
సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్‌మెంట్!

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్(25) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ముంబై బిజినెస్‌మెన్ రవి ఘాయ్ మనమరాలు సానియా ఛందోక్‌తో ఇవాళ అతని నిశ్చితార్థం జరిగినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై సచిన్ ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వేడుకకు అతికొద్దిమంది సన్నిహితులు హాజరైనట్లు సమాచారం. అర్జున్ దేశవాళీ క్రికెట్‌లో గోవాకు, IPLలో MIకి ఆడుతున్నారు.