News August 13, 2025

జాగ్రత్త.. నేటి నుంచే అతి భారీ వర్షాలు!

image

బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఇరు రాష్ట్రాల అధికారులు ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు, రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది?

Similar News

News April 19, 2026

‘పెద్ది’లో చెర్రీతో సంయుక్త స్టెప్పులు?

image

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌కు టాలీవుడ్ వర్గాల్లో క్రేజ్ పెరుగుతోంది. ఇందులో మృణాల్ ఠాకూర్, మానస వారణాసిలు కనిపిస్తారని ప్రచారం జరగ్గా ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. చెర్రీతో సంయుక్తా మీనన్ స్టెప్పులు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల అఖండ-2 మూవీలో బాలయ్యతో కలిసి ‘జాజికాయ’ పాటకు ఈ బ్యూటీ మాస్ స్టెప్స్ వేశారు.

News April 19, 2026

ఛేజింగ్‌లో చేతులెత్తేస్తున్న ఛాంపియన్లు

image

ఐదుసార్లు IPL ఛాంపియన్లు అయిన MI, CSK ఛేజింగ్‌లో చేతులెత్తేస్తున్నాయి. 2024 నుంచి ఇప్పటివరకు ముంబై 19 మ్యాచుల్లో 12 ఓడిపోగా, చెన్నై 16 మ్యాచుల్లో 10 ఓడిపోయి ఛేజింగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన జట్లుగా నిలిచాయి. ఈ ఇరు జట్లు ఛేజింగ్‌ను మెరుగుపర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక CSK కెప్టెన్ రుతురాజ్ ఛేజింగ్ రికార్డ్ కూడా వీక్‌గా ఉంది. 2022 నుంచి 23 మ్యాచ్‌ల్లో రుతురాజ్ కేవలం 518 రన్స్ చేశారు.

News April 19, 2026

SC, STలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెళ్లు: మంత్రి

image

AP: పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా SC, STలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతరులకు 40% రాయితీతో పంపిణీ చేస్తామన్నారు. ఈ స్కీమ్ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించవచ్చని, అదనంగా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మవచ్చని వివరించారు.