News August 13, 2025
SHAI HOPE: మోస్ట్ అండర్ రేటెడ్ వన్డే ప్లేయర్!

పాక్‌తో మూడో వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ (120*) సెంచరీ బాదారు. దీంతో విండీస్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన మూడో క్రికెటర్‌గా హోప్(18) రికార్డులకెక్కారు. ప్రస్తుత వన్డే క్రికెట్‌లో హోప్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్‌గా మిగిలిపోయారు. 137 ఇన్నింగ్సుల్లోనే 50.24 సగటుతో 18 సెంచరీలు, 29 ఫిఫ్టీలతో 5,879 రన్స్ బాదారు. ఆమ్లా, కోహ్లీ, బాబర్, డివిలియర్స్‌కు మాత్రమే అతడి కంటే మెరుగైన గణాంకాలు ఉన్నాయి.
Similar News
News August 14, 2025
థియేటర్లలో మారణహోమం జరుగుతుంది: NTR

జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్2’ మూవీ ఇవాళ వరల్డ్ వైడ్‌గా రిలీజవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్ మూవీపై అంచనాలు పెంచేశారు. ‘ఇది యుద్ధం. ఇవాళ థియేటర్లలో మారణహోమం జరుగుతుంది. వార్2 మూవీపై గర్వంగా ఉన్నాను. దీనిపై మీ రియాక్షన్స్ తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ అంతా ‘కొడుతున్నాం అన్న’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
News August 14, 2025
మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

TG: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ AI-2025’ జాబితాలో ఆయనకు చోటు దక్కింది. భారత్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వారికి ఈ జాబితాలో చోటు కల్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతోనే తనకు ఈ గౌరవం దక్కిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
News August 14, 2025
ఆగస్టు 14: చరిత్రలో ఈ రోజు

1947: విభజన గాయాల సంస్మరణ దినం
1947: పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం
1957: కమెడియన్ జానీ లీవర్ జననం
1968: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే జననం
2011: బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ మరణం
2012: మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావు దేశ్‌ముఖ్ మరణం
1983: సింగర్ సునిధి చౌహాన్ జననం