News August 14, 2025
థియేటర్లలో మారణహోమం జరుగుతుంది: NTR

జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్2’ మూవీ ఇవాళ వరల్డ్ వైడ్‌గా రిలీజవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్ మూవీపై అంచనాలు పెంచేశారు. ‘ఇది యుద్ధం. ఇవాళ థియేటర్లలో మారణహోమం జరుగుతుంది. వార్2 మూవీపై గర్వంగా ఉన్నాను. దీనిపై మీ రియాక్షన్స్ తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ అంతా ‘కొడుతున్నాం అన్న’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News April 17, 2026
బుమ్రా స్పీడ్ పెంచాలి.. ఇర్ఫాన్ సూచనలు

IPL: MI స్టార్ బౌలర్ బుమ్రా ఈ సీజన్‌లో ఆడిన 5 మ్యాచుల్లోనూ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ పలు సూచనలు చేశారు. బుమ్రా బౌలింగ్ వేగం తగ్గిందని, దాంతో పాటు స్లో బాల్స్ ఎక్కువగా వేస్తున్నారన్నారు. అలా కాకుండా వేగంగా బౌలింగ్ చేస్తూ అప్పుడప్పుడు స్లో బాల్స్ వేస్తే వికెట్లు వచ్చే ఛాన్సుందన్నారు. బుమ్రాకు ప్రత్యేక శిక్షణ అవసరం లేదని, చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందని తెలిపారు.
News April 17, 2026
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే?

ఎంత కష్టపడి సంపాదించినా కొందరి చేతిలో డబ్బు నిలవదు. శుక్ర, గురు గ్రహ అనుగ్రహం తక్కువగా ఉండటం వల్ల అలా జరుగుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక స్థిరత్వం కోసం శుక్రవారాల్లో లక్ష్మీదేవి పూజ, కనకధారా స్తోత్ర పఠనం చేయాలని సూచిస్తున్నారు. ఇంటి ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు. ఈ పరిహారాలు పాటిస్తే ఆర్థిక స్థితిని మెరుగుపడి అప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందట.
News April 17, 2026
బలవంతంగా మూత్రాన్ని ఆపుకుంటే?

మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే కిడ్నీలపై ప్రభావం పడుతుంది. కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్లు, మూత్ర వ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవడం వల్ల పైలోనెఫ్రిటిస్ అనే పరిస్థితికి దారితీయవచ్చు. ఇది ఒక ఇన్ఫెక్షన్. ఈ వ్యాధికి త్వరగా చికిత్స చేయకపోతే.. మూత్రపిండాలకు నష్టం కలగొచ్చు. మూత్రాశయం నుంచి బ్యాక్టీరియా మూత్రపిండాలకు చేరినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.


