News August 13, 2025

మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్

image

బంగారం దిగుమతులపై ఎలాంటి టారిఫ్‌లు విధించమని ట్రంప్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ధరలు తగ్గాయి. దీంతో HYD బులియన్ మార్కెట్‌లోనూ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.50 తగ్గి రూ.1,01,350కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.50 పతనమై రూ.92,900 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,25,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News August 14, 2025

థియేటర్లలో మారణహోమం జరుగుతుంది: NTR

image

జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్2’ మూవీ ఇవాళ వరల్డ్ వైడ్‌గా రిలీజవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్ మూవీపై అంచనాలు పెంచేశారు. ‘ఇది యుద్ధం. ఇవాళ థియేటర్లలో మారణహోమం జరుగుతుంది. వార్2 మూవీపై గర్వంగా ఉన్నాను. దీనిపై మీ రియాక్షన్స్ తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ అంతా ‘కొడుతున్నాం అన్న’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

News August 14, 2025

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

image

TG: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ AI-2025’ జాబితాలో ఆయనకు చోటు దక్కింది. భారత్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వారికి ఈ జాబితాలో చోటు కల్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతోనే తనకు ఈ గౌరవం దక్కిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

News August 14, 2025

ఆగస్టు 14: చరిత్రలో ఈ రోజు

image

1947: విభజన గాయాల సంస్మరణ దినం
1947: పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం
1957: కమెడియన్ జానీ లీవర్ జననం
1968: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే జననం
2011: బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ మరణం
2012: మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావు దేశ్‌ముఖ్ మరణం
1983: సింగర్ సునిధి చౌహాన్ జననం