News August 13, 2025
గద్వాల: ఉప్పొంగుతున్న వాగులు.. ప్రవాహాలు దాటవద్దు

గద్వాల జిల్లాలో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన ఆయన బీచుపల్లి పుష్కర ఘాట్‌తో పాటు ఇతర వాగులను పరిశీలించారు. వాగుల వద్ద ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలు అటువైపు వెళ్లకుండా చూడాలని స్థానిక పోలీసులకు ఆదేశించారు.
Similar News
News August 14, 2025
పంద్రాగస్టు నాడు మాంసం విక్రయాలు బంద్

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మాంసం విక్రయాలు నిషేధిస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా కబేళాలు, మాంసం దుకాణాలు, నాన్ వెజ్ హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే 1965 పురపాలక చట్టం ప్రకారం దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని బేతంచెర్ల కమిషనర్ హరి ప్రసాద్ హెచ్చరించారు.
News August 14, 2025
రజినీకాంత్ ‘కూలీ’ పబ్లిక్ టాక్

భారీ అంచనాల మధ్య రజినీకాంత్ ‘కూలీ’ మూవీ థియేటర్లలో విడుదలైంది. USలో ప్రీమియర్లు చూసిన సినీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రజినీ మాస్ అండ్ పవర్‌ఫుల్ డైలాగులతో మూవీ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఇక ఇప్పటికే వైరల్ అయిన పూజా హెగ్డే-సౌబిన్ షాహిర్ ‘మోనికా’ సాంగ్‌కు థియేటర్లలో పూనకాలేనని అంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
News August 14, 2025
మున్నేరు ఉప్పొంగడంతో రాకపోకలు బంద్

ముదిగొండ మండలం పరిధిలోని పండ్రేగుపల్లి నుంచి రామకృష్ణాపురం దారిలో మున్నేరు నది పొంగిపొర్లుతోంది. దీంతో ఆ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి తులసీరామ్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడంతో ప్రజల భద్రతకు తాము పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.