News August 13, 2025

ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు IOA ఆమోదం

image

2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ బిడ్డింగ్‌కు భారత ఒలింపిక్ సంఘం(IOA) ఆమోదం తెలిపింది. అవకాశం వస్తే అహ్మదాబాద్ వేదికగా ఈ క్రీడలు నిర్వహించాలని భారత్ యోచిస్తోంది. కాగా బిడ్డింగ్ దాఖలుకు ఆగస్టు 31 వరకు అవకాశం ఉంది. ఇదే సమయంలో నిర్వహణ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు కెనడా తాజాగా ప్రకటించడంతో భారత్‌కు అవకాశాలు మెరుగుపడ్డాయి.

Similar News

News August 14, 2025

అది మన చరిత్రలో విషాదకర అధ్యాయం: మోదీ

image

1947లో భారత్, పాక్ విభజన సందర్భంగా జరిగిన విధ్వంసంపై PM మోదీ ట్వీట్ చేశారు. ‘మన చరిత్రలోనే విషాదకర అధ్యాయమైన విభజన సమయంలో అసంఖ్యాక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఊహకందని నష్టాన్ని ఎదుర్కొన్నారు. వారి ధైర్య సాహసాలను గౌరవించుకోవాల్సిన రోజు ఇది. దేశాన్ని ఐక్యంగా, సామరస్యంగా ఉంచడం మన బాధ్యత అని ఈ రోజు గుర్తు చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. #PartitionHorrorsRemembranceDay హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేశారు.

News August 14, 2025

రేపటి నుంచి ఫ్రీ బస్..

image

APలో రేపటి నుంచి మహిళలకు ఫ్రీ బస్ స్కీం ప్రారంభం కానుంది. స్త్రీ శక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని CM చంద్రబాబు ప్రారంభించిన తర్వాతే జీరో ఫేర్ టికెట్ల జారీ మొదలవుతుంది. విజయవాడ PN బస్టాండ్‌లో సా.5 గంటల సమయంలో CM పథకాన్ని ప్రారంభిస్తారు. కాగా నాన్‌స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి(తిరుమల), ఆల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, AC బస్సుల్లో స్కీమ్ వర్తించదు

News August 14, 2025

శిల్పా శెట్టి దంపతులపై చీటింగ్ కేసు

image

బాలీవుడ్ యాక్టర్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ డీల్ విషయంలో ₹60 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెస్ట్ డీల్ TV ప్రై.లి. కంపెనీ పేరిట శిల్పా, రాజ్‌లు 2015-2023 మధ్య అక్రమాలకు పాల్పడ్డారని కొఠారీ ఆరోపించారు. కాగా రాజ్ 2021లో అశ్లీల చిత్రాల కేసులో జైలుకెళ్లొచ్చిన విషయం తెలిసిందే.