News August 13, 2025
BREAKING: ఖమ్మం: కారు బోల్తా.. ఇద్దరు మృతి

కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన ముదిగొండ మండలంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ మురళి తెలిపిన వివరాలిలా.. ముదిగొండ మండలం గోకినేపల్లి జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం అదుపుతప్పి ఓ కార్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఖమ్మం నగరానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
Similar News
News August 14, 2025
జిల్లా టాపర్లకు రూ.10,000

TG: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో టెన్త్, ఇంటర్ చదివి జిల్లా టాపర్లుగా నిలిచిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. ప్రతి జిల్లాలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు రూ.10,000 చొప్పున ఇవ్వనుంది. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఈ బహుమతులు ఇవ్వాలని, స్కూళ్లు, జిల్లా స్థాయిలో ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ సూచించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించాలని ఆదేశించింది.
News August 14, 2025
కరీంనగర్: PACSలో నామినేటెడ్ ప్రక్రియ..?

<<17399669>>PACS<<>> పాలకవర్గాలను ఎన్నికల ద్వారా కాకుండా నామినేటెడ్ ప్రక్రియతో భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనికోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. ఈ ప్రక్రియ పక్కనున్న APలో కొనసాగుతుంది. దీంతో ఎక్కువమంది కాంగ్రెస్ కార్యకర్తలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. PACS పాలకవర్గాల కాలపరిమితి నేటితో ముగుస్తుంది. ఈ సాయంత్రం కల్లా ఉత్తర్వులు వెలువడే ఆకాశముంది.
News August 14, 2025
ADB: భారీ వర్షాలు.. ఈ నంబర్లు సేవ్ చేస్కోండి

ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్‌లలో సహాయకేంద్రాలు ఏర్పాటుచేశారు. వరద ముంపు, అత్యవసర పరిస్థితుల్లో ఆ నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చు. జిల్లాల వారీగా నంబర్లు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ – 18004251939
నిర్మల్ – 9100577132
మంచిర్యాల – 08736-250501
ఆసిఫాబాద్ – 8500844365
SHARE IT