News August 14, 2025
జిల్లా టాపర్లకు రూ.10,000

TG: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో టెన్త్, ఇంటర్ చదివి జిల్లా టాపర్లుగా నిలిచిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. ప్రతి జిల్లాలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు రూ.10,000 చొప్పున ఇవ్వనుంది. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఈ బహుమతులు ఇవ్వాలని, స్కూళ్లు, జిల్లా స్థాయిలో ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ సూచించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించాలని ఆదేశించింది.
Similar News
News April 15, 2026
CBSE టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడు?.. విద్యార్థుల ఎదురుచూపులు

సీబీఎస్‌ఈ టెన్త్ రిజల్ట్స్ కోసం స్టూడెంట్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నిన్నే విడుదల అవుతాయని జాతీయ మీడియాలో ప్రచారం జరగడంతో అధికారిక వెబ్‌సైట్‌ను పదేపదే చెక్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. రిజల్ట్స్‌పై కచ్చితమైన డేట్ అండ్ టైమ్ ప్రకటించాలని విద్యార్థులు, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
News April 15, 2026
డీలిమిటేషన్.. సరిహద్దులను ఎలా నిర్ణయిస్తారు?

డీలిమిటేషన్‌తో దేశంలో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్త, పాత నియోజకవర్గాల సరిహద్దులను డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. నదులు, కొండలు వంటి సహజ సరిహద్దులు, జిల్లాల బార్డర్స్, రవాణా, పరిపాలనా సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రతి సీటులో సమాన సంఖ్యలో జనాభా ఉండేలా, అసెంబ్లీ సెగ్మెంటు ఏదో ఒక పార్లమెంటు పరిధిలోకి వచ్చేలా చూస్తుంది. SC, ST జనాభా ఎక్కువున్న చోట రిజర్వేషన్ కల్పిస్తుంది.
News April 15, 2026
నేడే ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉదయం 10.31 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. స్టూడెంట్స్ మన Way2newsలో సూపర్ ఫాస్ట్‌గా, సులభంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే వచ్చే స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో మార్కుల లిస్ట్ ప్రత్యక్షమవుతుంది.
* ALL THE BEST


