News August 13, 2025
NEET (UG) కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో MBBS సీట్ల భర్తీకి చేపట్టిన NEET (UG) కౌన్సెలింగ్ ఫస్ట్ రౌండ్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 14 నుంచి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సూచించింది. అలాట్‌మెంట్ లెటర్‌ను MCC వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. సీట్ అలాట్‌మెంట్ లిస్ట్ కోసం ఇక్కడ <
Similar News
News April 18, 2026
GT vs KKR.. ఎవరు గెలిచారంటే?

IPL-2026లో KKRకు మరో ఓటమి ఎదురైంది. కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గిల్ 86 పరుగులతో రాణించారు. అంతకుముందు గ్రీన్ 79 రన్స్ చేయడంతో కేకేఆర్ 180 పరుగులు చేయగలిగింది. ఇది GTకి మూడో విజయం కాగా, KKRకు 5వ ఓటమి.
News April 18, 2026
1 Min లేటైనా CETకు అనుమతి లేదు

AP: Eng, Agri తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET ఇతర పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని APSCHE స్పష్టం చేసింది. CETలపై ఇవాళ కన్వీనర్లతో సమీక్షించి షెడ్యూల్ జారీ చేసింది. EAPCET-Eng మే 12-15, 18, Agri& phm మే 19, 20 తేదీల్లో జరుగుతాయి. ECET APR 23, PGECET APR 28-30, ICET మే 2, లాసెట్ మే4, EDCET మే 8, PGCET మే 8-11తేదీల్లో జరుగుతాయి.PGCET 3, ఇతర సెట్లన్నీ 2 షిఫ్ట్‌లలో ఉంటాయి.
News April 18, 2026
మహిళా రిజర్వేషన్: 2034 వరకు ఆగాల్సిందేనా?

2026 జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యాకే ‘నారీ శక్తి వందన్ అధినియం-2023’ చట్టం అమల్లోకి వస్తుందని అప్పట్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. తాజాగా 131వ సవరణ బిల్లు వీగిపోవడంతో 2029లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం కష్టమని, 2034 వరకు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పటివరకు మహిళలు వేచి చూడాల్సిందేనేమో!


