News August 13, 2025

NEET (UG) కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల

image

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో MBBS సీట్ల భర్తీకి చేపట్టిన NEET (UG) కౌన్సెలింగ్ ఫస్ట్ రౌండ్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 14 నుంచి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సూచించింది. అలాట్‌మెంట్ లెటర్‌ను MCC వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. సీట్ అలాట్‌మెంట్ లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News April 18, 2026

దోమకొండ కోట.. వారసత్వ సంపదే

image

దోమకొండ కోట యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్ పొందింది. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప వారసత్వ సంపదలో ఇది ఒకటి. 18వ శతాబ్దంలో కామినేని వంశస్థులు నిర్మించిన ​చారిత్రక నేపథ్యం ఉంది. 40 ఎకరాల విస్తీర్ణంలో
​నీటి కందకం, ​అద్దాల మేడ, అందమైన గాజు కిటికీలు, ​వెంకట భవనం(రాజభవనం) దర్బార్ హాల్, నాట్యశాల, ఏనుగులు, గుర్రపు శాలలు, మహాదేవుని ఆలయం కనువిందు చేస్తాయి. కోట అద్భుత శిల్పకళను చూశారా..!
# WORLD HERITAGE DAY

News April 18, 2026

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
*అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు
*రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టాం: రాహుల్
*విపక్షాలపై అమిత్ షా, చంద్రబాబు, వైఎస్ జగన్ ఫైర్
*రేపు దేశవ్యాప్తంగా నిరసనలకు NDA పిలుపు
*హార్ముజ్ ఓపెన్ చేశాం: ఇరాన్
*అంబానీని దాటేసి.. ఆసియా కుబేరుడిగా అదానీ

News April 18, 2026

GT vs KKR.. ఎవరు గెలిచారంటే?

image

IPL-2026లో KKRకు మరో ఓటమి ఎదురైంది. కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గిల్ 86 పరుగులతో రాణించారు. అంతకుముందు గ్రీన్ 79 రన్స్ చేయడంతో కేకేఆర్ 180 పరుగులు చేయగలిగింది. ఇది GTకి మూడో విజయం కాగా, KKRకు 5వ ఓటమి.