News August 13, 2025
స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

విశాఖ వన్ టౌన్ ఏఆర్ గ్రౌండ్స్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సీపీ శంఖబ్రత బాగ్చీ పరిశీలించారు. వీవీఐపీ భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది కవాతును సమీక్షించారు. జెండా వందనం, వందన సమర్పణ పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు, అధికారులు, ప్రజలు కూర్చునే గ్యాలరీలను పరిశీలించారు.
Similar News
News April 18, 2026
విశాఖ-మహబూబ్‌నగర్ రైళ్ల పాక్షిక రద్దు

సికింద్రాబాద్-డోన్ సెక్షన్ పరిధిలోని మహబూబ్‌నగర్ – మన్యంకొండ మధ్య రైల్వే డబ్లింగ్ పనుల కారణంగా విశాఖ – మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 18 నుంచి 20 వరకు విశాఖలో బయలుదేరే రైలు (12861) జడ్చర్ల వరకే నడుస్తుంది. అలాగే 19 నుంచి 21 వరకు మహబూబ్‌నగర్ రైలు (12862) జడ్చర్ల నుంచే తిరుగు ప్రయాణం కానుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలనీ సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు.
News April 18, 2026
విశాఖ – షాలిమార్ మధ్య స్పెషల్ రైలు

వేసవి రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – షాలిమార్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. రైలు (08504) ఏప్రిల్ 22న రాత్రి 11:45కు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08505) ఏప్రిల్ 23న సాయంత్రం 6 గంటలకు షాలిమార్ నుంచి బయలుదేరుతుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్ కుమార్ తెలిపారు.
News April 18, 2026
విశాఖలో ఒక్కరోజే 2,430 కేసులు నమోదు

విశాఖలోని శుక్రవారం ఒక్కరోజే 2,430 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,137, పిలియన్ రైడర్-223, ట్రిపుల్ రైడింగ్- 82, ఓవర్ స్పీడ్-220, సెల్ఫోన్ డ్రైవింగ్-28, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-15, మైనర్ డ్రైవింగ్ 03, రాంగ్ పార్కింగ్-180, డ్రంకన్ డ్రైవింగ్-35, సీజ్ అయిన వెహికల్స్-43, ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-547 కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేయగా 20 బస్సులు తనిఖీ చేశారు.


