News August 14, 2025

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

image

TG: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ AI-2025’ జాబితాలో ఆయనకు చోటు దక్కింది. భారత్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వారికి ఈ జాబితాలో చోటు కల్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతోనే తనకు ఈ గౌరవం దక్కిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Similar News

News August 14, 2025

రేపు పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు

image

AP: కేంద్రం ఆదేశాల మేరకు రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధన పథకాలపై అవగాహన, పశుసంవర్ధక శాఖ తోడ్పాటుతో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం, పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయడంపై తీర్మానాలు చేయాలని కేంద్రం సూచించింది.

News August 14, 2025

NTR, హృతిక్ ‘వార్-2’ పబ్లిక్ టాక్

image

NTR, హృతిక్ రోషన్ కాంబోలో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్-2’ ప్రీమియర్ షోలు USలో నడుస్తున్నాయి. ఫస్టాఫ్‌లో ఇంట్రడక్షన్ సీక్వెన్స్, NTR, హృతిక్ డాన్స్ హైలైట్ అని ఫ్యాన్స్ SMలో పోస్టులు చేస్తున్నారు. యాక్షన్ సీన్స్, సెకండాఫ్‌లో కొన్ని ట్విస్టులు, క్లైమాక్స్ అదిరిపోయాయంటున్నారు. అయితే BGM, VFX ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదంటున్నారు. కాసేపట్లో Way2News రివ్యూ.

News August 14, 2025

కొత్త బార్ పాలసీ.. అర్ధరాత్రి వరకు పర్మిషన్

image

AP: ఎక్సైజ్ శాఖ కొత్త<<17322257>> బార్ పాలసీ<<>>ని ప్రకటించింది. ఇది SEP1 నుంచి మూడేళ్లపాటు అమలవుతుంది. మొత్తం 840 బార్లను నోటిఫై చేసింది. లాటరీ విధానంలో ఎంపిక ఉంటుంది. ఒక్క బారుకు కనీసం 4 అప్లికేషన్స్ వస్తేనే లాటరీ తీస్తారు. అప్లికేషన్ ఫీజు రూ.5లక్షలు+ రూ.10వేలు చెల్లించాలి. నూతన విధానం ప్రకారం ఉ.10 గం. నుంచి అర్ధరాత్రి 12గం. వరకు బార్లకు అనుమతి ఉండనుంది. రూ.99 మద్యం మినహా అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి.