News August 14, 2025

HYD: ఏమండోయ్ ఇది విన్నారా?

image

పోలీస్ వస్తుండంటే దొంగ పారిపోయినట్లు ఉంది ఈ కథ. కీసరలో బుధవారం ఒకేసారి మెడికల్ షాపులు మూతబడ్డాయి. స్ట్రైక్ ఏమైనా చేస్తున్నారా? అని ఆరా తీయగా అసలు విషయం తెలిసి జనం షాకయ్యారు. మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు చేస్తున్నాడని షాపులు మూసేయడంతో ముక్కున వేలేసుకున్నారు. నిబంధనలు పాటిస్తోన్న షాపులే లేవా? అని ఆలోచనలో పడ్డారు. మెడికల్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News April 16, 2026

ఖమ్మం: సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కీలక నేతగా..

image

కాంగ్రెస్‌లో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నగర అధ్యక్షుడిగా, టీపీసీసీ సభ్యుడిగా, కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ జావిద్ ఎదిగారు. రాహుల్ గాంధీ జోడోయాత్ర, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఏడేళ్లు ఖమ్మం నగర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేయగా, పార్టీ కార్యాలయంలో గత మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ జావిద్‌ను సత్కరించారు.

News April 16, 2026

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో ‘తేజస్వి’ విజయభేరి

image

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో HNK తేజస్వి పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారు. శ్రీ వైభవి 486, అవ్ని బిజ్జాల 485, విష్ణుప్రియ 480 మార్కులు సాధించారు. మొత్తం 144 మంది విద్యార్థుల్లో 35 మంది 90 శాతానికి పైగా మార్కులు సాధించడం విశేషం. క్రమశిక్షణతో కూడిన బోధన, నిరంతర పరీక్షలే ఈ విజయానికి కారణమని డైరెక్టర్ రేవూరి భగవాన్ రెడ్డి తెలిపారు.

News April 16, 2026

జమ్మికుంట: మార్కెట్‌కు 3 రోజులు సెలవులు

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 3 రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్‌ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. శుక్రవారం అమావాస్య సందర్భంగా సెలవు, శని, ఆదివారాల్లో సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి 20న సోమవారం మార్కెట్ యథావిధిగా పునః ప్రారంభం అవుతుందని వెల్లడించారు. కావున రైతులు, వ్యాపారస్థులు, కార్మికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాల్సిందిగా ఆమె కోరారు.