News August 14, 2025

HYD: ఏమండోయ్ ఇది విన్నారా?

image

పోలీస్ వస్తుండంటే దొంగ పారిపోయినట్లు ఉంది ఈ కథ. కీసరలో బుధవారం ఒకేసారి మెడికల్ షాపులు మూతబడ్డాయి. స్ట్రైక్ ఏమైనా చేస్తున్నారా? అని ఆరా తీయగా అసలు విషయం తెలిసి జనం షాకయ్యారు. మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు చేస్తున్నాడని షాపులు మూసేయడంతో ముక్కున వేలేసుకున్నారు. నిబంధనలు పాటిస్తోన్న షాపులే లేవా? అని ఆలోచనలో పడ్డారు. మెడికల్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News April 16, 2026

నేడు రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణం

image

MHBD జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన వేం నరేందర్ రెడ్డి గురువారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. TG నుంచి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన ప్రమాణ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన నరేందర్ రెడ్డి ఎన్నికపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నారు.

News April 16, 2026

చల్వాయిలో పరకాల వాసి సుపారీ హత్య..?

image

ములుగు జిల్లా చల్వాయి శివారులో పరకాలకు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతడి భార్యే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలుస్తోంది. సుమన్ అనే వ్యక్తి తప్పిపోయినట్లు HNK (D) పరకాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ జరిపిన పోలీసులు మార్చి 3న చల్వాయి వద్ద హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి కాల్చివేసినట్లు గుర్తించినట్టు సమాచారం. పస్రా, పరకాల పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి ఆధారాలు సేకరించారు.

News April 16, 2026

నల్గొండలో 2, సూర్యాపేటలో మరో నియోజకవర్గం..!

image

ఉమ్మడి NLG, KMM, WGL జిల్లాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలతో సూర్యాపేట కేంద్రంగా కొత్త MP నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు కొత్త అసెంబ్లీ స్థానాలు రానున్నట్లు తెలుస్తోంది. నల్గొండను అర్బన్, రూరల్ నియోజకవర్గాలుగా విభజించడంతో పాటు, సూర్యాపేటలోనూ అర్బన్ స్థానాన్ని ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.