News August 14, 2025
అలాగైతే భారత్‌పై మరింత టారిఫ్స్: US హెచ్చరిక

భారత్‌పై టారిఫ్స్‌ను US మరింత పెంచవచ్చని ఆ దేశ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ హెచ్చరించారు. అలస్కాలో శుక్రవారం జరిగే ట్రంప్-పుతిన్ భేటీ రిజల్ట్‌పై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అంగీకరిస్తే టారిఫ్స్ పెంపు ఉండకపోవచ్చని, లేదంటే సుంకాలు పెంపు తప్పదన్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని ఇప్పటికే INDపై US 25% అదనపు టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.
Similar News
News April 19, 2026
RCBకి శాపంగా గ్రీన్ జెర్సీ!

ఆర్సీబీకి మరోసారి గ్రీన్ జెర్సీ కలిసి రాలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం 2011 సీజన్ నుంచి బెంగళూరు ప్లేయర్లు ఒక్కో మ్యాచులో ఈ గ్రీన్ కలర్ జెర్సీ ధరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ జెర్సీలో 15 మ్యాచులు ఆడగా అందులో తొమ్మిదింట్లో (ఇవాళ ఢిల్లీతో కలిపి) ఓడింది. ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆడిన తొలి, 50వ, 100వ మ్యాచుల్లో ఓటమిపాలు కావడం గమనార్హం.
News April 18, 2026
జర్నీలో వాంతులు చేసుకుంటున్నారా?

చెవిలో ఉండే లాబ్రింథ్స్, యూట్రికెల్ భాగాలు మెదడుకు సంకేతాలు సరిగా అందించకపోతే ప్రయాణాల్లో వాంతులు చేసుకోవడం, కళ్లు తిరగడం లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. వెనుక సీట్లో బదులు ముందు కూర్చోవాలని సూచిస్తున్నారు. విండో తెరిచి స్వచ్ఛమైన గాలికి సేద తీరాలంటున్నారు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని, తులసి ఆకులను నమలాలని సూచిస్తున్నారు. అల్లం టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుందంటున్నారు.