News August 14, 2025

అలాగైతే భారత్‌పై మరింత టారిఫ్స్: US హెచ్చరిక

image

భారత్‌పై టారిఫ్స్‌ను US మరింత పెంచవచ్చని ఆ దేశ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ హెచ్చరించారు. అలస్కాలో శుక్రవారం జరిగే ట్రంప్-పుతిన్ భేటీ రిజల్ట్‌పై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అంగీకరిస్తే టారిఫ్స్ పెంపు ఉండకపోవచ్చని, లేదంటే సుంకాలు పెంపు తప్పదన్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని ఇప్పటికే INDపై US 25% అదనపు టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.

Similar News

News April 18, 2026

భూములిచ్చే రైతులకు ఎకరాకు ₹40 వేల కౌలు: CBN

image

AP: రాజధాని రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చే రైతులకు ఎకరానికి ₹40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని CM చంద్రబాబు తెలిపారు. ఏడాదికి ₹3 వేల చొప్పున కౌలు పెంచుతామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ₹1.50 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ చేస్తామని వివరించారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.

News April 18, 2026

2028లోనే TG అసెంబ్లీ ఎన్నికలు?

image

పునర్విభజనతో ముడిపడిన మహిళా రిజర్వేషన్ బిల్లు నిన్న LSలో వీగిపోవడంతో కేంద్రం 2029లో చేపట్టాలనుకున్న జమిలి ఎన్నికలూ అసాధ్యమేనని రాజకీయ వర్గాలంటున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, తర్వాత జమిలికి వెళ్లాలని మోదీ ప్రభుత్వం భావించిందని చెబుతున్నారు. కానీ డీలిమిటేషన్ కుదరకపోవడంతో దీనికి వెళ్లకపోవచ్చని అంటున్నారు. అలా అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు యథాతథంగా 2028లోనే జరగనున్నాయి.

News April 18, 2026

నేడు 2 మ్యాచులు.. SRHపై ధోనీ ఆడతారా?

image

IPLలో ఇవాళ డబుల్ ధమాకా ఉండనుంది. 3.30PMకు ఢిల్లీ, బెంగళూరు తలపడనున్నాయి. ఆడిన 5 మ్యాచుల్లో 4 గెలిచి RCB జోరు మీద ఉండగా, చివరి 2 మ్యాచుల్లో ఓడి DC కష్టాల్లో ఉంది. మరోవైపు 7.30PMకు SRH, CSK మధ్య కీలక పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరుజట్లూ చెరో 2 గెలిచి, 3 ఓడాయి. అయితే వరుసగా 2 మ్యాచుల్లో గెలవడం, ధోనీ ఆడే అవకాశం ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. మరోవైపు SRH బ్యాటింగ్‌లో అదరగొడుతున్నా బౌలింగ్‌లో తేలిపోతోంది.