News August 18, 2025

భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Similar News

News August 20, 2025

ఎయిర్ ఇండియాకు IOC హరిత ఇంధనం

image

ఎయిర్ ఇండియాకు సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్‌(SAF) సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) ఒప్పందం కుదుర్చుకుంది. హోటల్, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెలతో SAF ఉత్పత్తి చేపట్టేందుకు IOC సన్నాహాలు చేస్తోంది. హరియాణాలోని పానిపట్ రిఫైనరీలో ఏటా 35 వేల టన్నుల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయబోతున్నట్లు ఛైర్మన్ అర్విందర్ సింగ్ తెలిపారు. ఈ ఫ్యూయెల్‌తో వాయు కాలుష్యం తగ్గుతుందని వెల్లడించారు.

News August 20, 2025

తుది జట్టులో గిల్‌.. ఎవరిని పక్కన పెట్టాలి?

image

ఆసియా కప్‌కు భారత జట్టును BCCI ప్రకటించిన విషయం తెలిసిందే. వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంతో గిల్‌కు తుది జట్టులో ప్లేస్ ఖాయమైనట్లే. దీంతో టాపార్డర్‌ బ్యాటర్స్ అభిషేక్, శాంసన్, తిలక్‌లలో ఒకర్ని పక్కన పెట్టాల్సి రావొచ్చు. అభిషేక్ ICC No.1 ర్యాంకర్‌గా ఉన్నారు. మరోవైపు శాంసన్ గత 10 T20Isలో 3 సెంచరీలు, తిలక్ లాస్ట్ 7 T20Isలో 2 సెంచరీలు చేసి ఫామ్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరిని పక్కన పెట్టాలి? COMMENT

News August 20, 2025

మద్యం దుకాణాల టెండర్ల ఫీజు ఖరారు

image

TG: మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం ఫీజు ఖరారు చేసింది. రూ.3 లక్షల నాన్ రిఫండబుల్ డీడీ చెల్లించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. గతంలో ఇది రూ.2లక్షలే. నగరాల్లో లైసెన్స్ ఫీజును సైతం రూ.10 లక్షలకు పెంచింది. కానీ కాలపరిమితి మాత్రం పాత పద్ధతిలోనే 2 ఏళ్లకే(2025-2027) పరిమితం చేసింది. టెండర్ల స్వీకరణ తేదీలు ఇంకా ప్రకటించలేదు. రిజర్వేషన్లు గౌడ్స్‌కి 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5శాతంగా నిర్ధారించింది.