News April 1, 2024

ధోనీ ధనాధన్.. పదేళ్ల క్రితం ట్వీట్ వైరల్

image

నిన్నటి ఢిల్లీ, చెన్నై మ్యాచ్‌లో ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. CSK ఓడినా మునపటి ధోనీని చూశాం, అది చాలు అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ పదేళ్ల క్రితం చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ఏ జట్టు గెలుస్తుందనేది అనవసరం, నేను ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికే ఉన్నా’ అని 2014, మార్చి 24న ట్వీట్ చేశారు. అన్నట్టుగానే ధోనీ ఎంటర్‌టైన్ చేశారంటూ ఫ్యాన్స్ ఆ పాత పోస్ట్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

Similar News

News November 7, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ.. UAEలో భారత్ మ్యాచులు!

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 హైబ్రిడ్ మోడల్‌లో జరిగే అవకాశం ఉందని PTI తెలిపింది. భారత్ తన మ్యాచులను యూఏఈలోని దుబాయ్ లేదా షార్జాలో ఆడనుందని పేర్కొంది. నవంబర్ 11న ఆ టోర్నీ షెడ్యూల్ అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. కాగా, తొలుత ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాకిస్థాన్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అక్కడికి వెళ్లేందుకు బీసీసీఐ నో చెప్పడంతో తాజాగా మార్పులు చేసినట్లు సమాచారం.

News November 7, 2024

సునీతా విలియమ్స్ ఆరోగ్యంగా ఉన్నారు: నాసా

image

సునీతా <<14549029>>విలియమ్స్<<>> ఆరోగ్యంగా ఉన్నట్టు నాసా స్ప‌ష్ట‌త ఇచ్చింది. ISSలో ఉన్న వ్యోమ‌గాములందరూ ఆరోగ్యంగా ఉన్నారని, వీరికి క్ర‌మం త‌ప్ప‌కుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు నాసా ప్రతినిధి జిమి రస్సెల్ తెలిపారు. ఫ్లైట్ సర్జన్లు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వెల్ల‌డించారు. అయితే కేలరీల లోటు వల్ల కొంచెం బరువు తగ్గడంతో సునీత బుగ్గలు లోపలికి అణిగినట్టు గుర్తించానని రస్సెల్ పేర్కొన్నారు.

News November 7, 2024

US: బాలయ్యకు ఓటు.. నెటిజన్ల విమర్శలు

image

తాజాగా జరిగిన అమెరికా ఎన్నికల్లో ఓ వ్యక్తి <<14545604>>బాలయ్యకు<<>> ఓటు వేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే దీనిపై విమర్శలొస్తున్నాయి. ఎంతో విలువైన ఓటును ఇలా దుర్వినియోగం చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. ఆ ఓటు వేసిన వ్యక్తిపై కేసు వేసి US పౌరసత్వం రద్దు చేస్తే అప్పుడు ఓటు విలువ తెలుస్తుందని మండిపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?